OTT Movie : ఈ వారం మలయాళ సినిమా అభిమానులకు సరికొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. అది కూడా మూడు కొత్త సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ‘సీ ఆఫ్ లవ్’ (Kadalolam Sneham), ‘చట్టూలి’ (Chattuli), ‘వల్సాలా క్లబ్’ (Valsala Club) వంటి సినిమాలు ఉన్నాయి. ఇవి రొమాన్స్, థ్రిల్లర్, కామెడీ లతో ఆడియన్స్ కి ఒక కొత్త ట్రీట్ ని ఇస్తున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
దిల్షా ప్రసన్నన్, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ సినిమాకి సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. 2025 అక్టోబర్ 24 నుంచి ఈ సినిమా మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబిలో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది. ఇందులో బిగ్ బాస్ మలయాళం విన్నర్ దిల్షా ప్రసన్నన్ హీరోయిన్‌గా నటించడం కూడా సినిమాకి హైప్ తెచ్చింది. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ కథలో ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ, ఎమోషనల్ ట్విస్ట్‌లు ఉంటాయి. సముద్ర తీరంలో సెట్ చేసిన కొన్ని సీన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటాయి. ఈ కథలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో పడతారు. కానీ వీళ్ళ ఫ్యామిలీలతో అసలు సమస్యలు వస్తాయి. వీళ్ళ ప్రేమను పరీక్షిస్తాయి. దీనికి తోడు ఒక ట్రాజెడీ ట్విస్ట్ కూడా వస్తుంది. ఇది కథను మరింత ఎమోషనల్‌గా మలుస్తుంది. రొమాంటిక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూస్తూ, బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ రివేంజ్ థ్రిల్లర్ సినిమాకి జోజి థామస్ దర్శకత్వం వహించారు. ఇందులో షైన్ టామ్ చాకో , జాఫర్ ఇదుక్కి ప్రధాన పాత్రల్లో నటించారు. ఐయండిబిలో 7.2/10 ని పొందిన ఈ సినిమా 2025 అక్టోబర్ 20 నుంచి మనోరమా మాక్స్‌లోఅందుబాటులోకి వచ్చింది.
ఈ కథ అట్టప్పాడి అడవుల్లో జరుగుతుంది. ఒక అంధుడైన వృద్ధుడు, ఒక యువకుడు రివేంజ్ కోసం కలిసి పని చేస్తాయారు.
వీళ్లిద్దరూ గతంలో ఒక క్రూరమైన క్రైమ్‌కి బాధితులవుతారు. అంధుడైన వృద్ధుడు తన గతంలోని బాధను, టీనేజర్ తన కోపాన్ని కలిపి ఒక సర్వైవల్ జర్నీలోకి వెళతారు. ఈ కథ సస్పెన్స్, యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్ తో చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. సస్పెన్స్, రెవెంజ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. షైన్ టామ్ చాకో నటన, అడవి సెట్టింగ్‌లో ఇంటెన్స్ సీన్స్ రియలిస్టిక్ గా ఉంటాయి.
ఈ సినిమాకి అనుష్ మోహన్ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీక్ శంకర్, అఖిల్ కవలయూర్, రూపేష్ పీతాంబరన్, గౌరి ఉణ్ణిమాయ, అధిరాధ్ కె. ప్రధాన పాత్రల్లో నటించారు. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా, 2025 అక్టోబర్ 19నుంచి మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ సినిమా, గ్రామీణ నేపథ్యంలో సెట్ చేయబడింది. కథలో వల్సాలా క్లబ్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్లు గ్రామంలో జరిగే వెడ్డింగ్స్‌ని స్పాయిల్ చేయడాన్ని ఒక స్పోర్ట్‌లా భావిస్తారు. ఒక రోజు వీళ్లు ఒక అబ్బాయికి ఒక వారంలో పెళ్లి చేసి, ఆ గ్రామంలోని ట్రెడిషన్‌ని బ్రేక్ చేయాలని ఒక బెట్ వేస్తారు. ఈ ప్రాసెస్‌లో కామెడీ సీన్స్, గ్రామీణ జీవితంలోని ఫన్నీ మూమెంట్స్, కొన్ని ఎమోషనల్ టచ్ తో ఈ కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. గ్రామీణ కల్చర్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకి హైలైట్. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా బెస్ట్.
Read Also : బాబోయ్ ఇదేం సినిమా మావా… పేరుకే లవ్ స్టోరీ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా ఉన్నప్పుడు చూడాల్సిన మూవీ