Siddipeta News: సిద్దిపేటలోని సిటిజన్స్ క్లబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్‌లో పేకాట జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. పేకాట ఆడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో భారీగా నగదు కూడా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.