Tirupati Sabha: జగన్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబబు. గొడ్డలి పార్టీకి గోల్ లేదని, పాయిజన్ మైండ్ అని ఆరోపించారు. నమ్ముకుంది ఫేక్ న్యూస్ అని, మేము నమ్ముకున్నది ప్రజల్ని చెప్పారు. కనీసం ఆ పార్టీకి విజన్ లేదన్నారు. వారి దగ్గరకు వెళ్తే ఆ విషం మనల్లి కూడా దమించి వేస్తుందన్నారు. తాము నమ్ముకున్నది పాజిటివ్, అభివృద్ధి రాజకీయాలన్నారు. యువత భవిష్యత్, భావి తరాలు భవిష్యత్ మార్చే రాజకీయం ఎన్డీయే చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నేషన్ ఫస్ట్ అని, ఇక్కడున్న ఎన్డీయే కూటమికి స్టేట్ ఫస్ట్ అని అన్నారు.
జగన్ పార్టీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. తిరుపతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతిపై ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, తొలుత అమరావతికి సరేనని అన్నారని, ఆ తర్వాత మూడు రాజధానులు అన్నారని ఎద్దేశా చేశారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని, మావిగాన్ వాటికనూ నాకైతే తెలియదన్నారు. ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అవుతుందా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. అమరావతి ప్రజా రాజధాని అని, ప్రపంచంలో మేటైనదని చెప్పారు.
ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని, ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం ఎన్నో సవాళ్లను అధిగమిస్తున్నామని అన్నారు. ఇరాన్‌లో యుద్ధం జరిగితే మన దగ్గర మామిడి, అరటి ధరలు పడిపోయాయని అన్నారు. పెట్రోల్-డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మరో వైపు వర్షాలు పడవని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోందని, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
గొడ్డలి పార్టీకి గోల్ లేదు.. పాయిజన్ మైండ్-సీఎం చంద్రబాబు
బ్రిటిష్ వాళ్లు వెంకటేశ్వరస్వామి జోలికి రాలేదని, వారు కూడా భయపడ్డారని అన్నారు. స్వామి జోలికి వస్తే ఈ జన్మలో శిక్ష అనుభవిస్తారని తెలిపారు. స్వామి పవిత్రత కాపాడుకునే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉందన్నారు. గతంలో ఎమ్మార్వో ఆఫీసు, హాస్పిటల్స్, మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినవాళ్లు ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఉందా?
ఎన్నికల్లో విజయం చూసి పొంగిపోలేదని, అలాగని రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదన్నారు. హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది కల్యాణి డ్యామ్‌కు నీరు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్న-తిరుపతి వెంకన్నను కలుపుతామని వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని, ఆర్థిక ఇబ్బందులు ఎన్నివున్నా హామీలు నెరవేరుస్తున్నామన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్ ఇలా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ భరోసా దేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమని గుర్తు చేశారు. 12 ఏళ్లలో ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్లిందన్నారు.
ALSO READ: ఈ కూటమికి తిరుగుండదు, తిరుపతి కూటమి సభ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు