Spectacle Marks Removal Tips: ఈ రోజుల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే.. రోజంతా అద్దాలు పెట్టుకోవడం వల్ల ముక్కుకు ఇరు వైపులా నల్లటి మచ్చలు లేదా ఎర్రటి గుంతలు పడిపోతుంటాయి. అద్దాలు తీసేసినప్పుడు ఆ మచ్చలు ముఖం అందాన్ని పాడుచేస్తుంటాయి. మరి ఈ సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా? నో టెన్షన్. మన ఇంట్లో దొరికే కొన్ని సింపుల్ వస్తువులతో ఆ నల్లటి మచ్చలను చాలా ఈజీగా ఎలా తగ్గించుకోవాచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లద్దాల వల్ల ముక్కుపై నల్ల మరకలు వదిలించే టిప్స్:
నిజానికి ముక్కుపై మచ్చలు పడటానికి ప్రధాన కారణం అద్దాల బరువు, వాటి నోస్ ప్యాడ్స్ నిరంతరం చర్మంపై ఒత్తిడి తెవడమే. దీని వల్ల ఆ భాగంలో .. పిగ్మెంటేషన్ పెరిగి నల్లగా మారుతుంది. ఈ మచ్చలను లైట్ చేయడానికి బెస్ట్ నాచురల్ టిప్స్ ఇవే..
1. అలోవెరా జెల్ (కలబంద) మ్యాజిక్:
కలబందలో చర్మాన్ని చల్లబరిచే, నల్లదనాన్ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎలా వాడాలి?: రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకుని ముక్కుపై మచ్చలు ఉన్న చోట సర్క్యులర్ మోషన్‌లో 5 నిమిషాలు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయండి. ఇలా రోజూ చేస్తే మచ్చలు త్వరగా లైట్ అవుతాయి.
2. బంగాళదుంప రసం:
పొటాటోలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఎలాంటి స్కిన్ మార్క్స్‌నైనా తగ్గించడంలో తోడ్పడతాయి.
ఎలా వాడాలి?: ఒక చిన్న బంగాళదుంప ముక్కను తీసుకుని ముక్కుపై మచ్చల దగ్గర మృదువుగా రుద్దండి. లేదా దాని రసాన్ని కాటన్ బాల్‌తో అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
3. నిమ్మరసం , తేనె కలయిక:
తేనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తే.. నిమ్మరసంలోని విటమిన్-సి నల్లటి రంగును పారద్రోలుతుంది.
ఎలా వాడాలి?: కొన్ని చుక్కల నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి మచ్చలపై రాయండి. 10 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి.
మచ్చలు మళ్లీ రాకుండా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కేవలం చిట్కాలు పాటించడమే కాదు, అసలు సమస్య ఎక్కడుందో చూసుకోవాలి. అద్దాల వల్ల మచ్చలు పెరగకుండా ఉండాలంటే ఈ కింది మార్పులు చేసుకోండి.
నోస్ ప్యాడ్స్ మార్చండి: మీ కళ్లద్దాలకు గట్టి ప్లాస్టిక్ నోస్ ప్యాడ్స్ ఉంటే.. వాటి స్థానంలో సాఫ్ట్ సిలికాన్ ప్యాడ్స్ వేయించుకోండి. ఇవి ముక్కుపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
లైట్ వెయిట్ ఫ్రేమ్స్: బరువైన ఫ్రేమ్స్ కాకుండా తేలికపాటి మెటీరియల్‌తో చేసిన అద్దాలను ఎంచుకోండి.
ఫేస్ మాయిశ్చరైజర్: రోజూ ముక్కు భాగంలో మంచి మాయిశ్చరైజర్ లేదా విటమిన్-ఇ ఆయిల్ రాయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండి మచ్చలు పడవు.
ముక్కుపై పడే కళ్లద్దాల నల్లటి మచ్చలు ఒకే రోజులో మాయం అయిపోవు. పైన పేర్కొన్న చిట్కాలను కనీసం రెండు మూడు వారాల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మీకే తేడా కనిపిస్తుంది. దాంతో పాటు వీలైనప్పుడల్లా (ఉదాహరణకు ఇంట్లో ఉన్నప్పుడు లేదా సిస్టమ్ ముందు లేనప్పుడు) అద్దాలను కాసేపు పక్కన పెట్టి ముక్కుకు కొంచెం గ్యాప్ ఇవ్వడం అలవాటు చేసుకోండి.