E-Paper
Advertisement

భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!

భార్యను కత్తితో బెదిరించి.. ఒంటికి నిప్పు అంటించుకున్న భర్త!
Advertisement

Suicide Attempt: పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసకున్న గటన చోటుచేసుకుంది. చాట్రగడ్డపాడు గ్రామానికి చెందిన కోటయ్య అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన కోటయ్య నిత్యం మద్యం సేవించి భార్య పిల్లల్ని వేధిస్తూ ఉండేవాడని బంధువులు పేర్కోన్నారు.

తల్లికి వందనం పథకం..

అయితే తనకున్న ముగ్గురు పిల్లలకు ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా వారికి రూ. 39000 జమ చేసింది. తల్లి కోటమ్మ పిల్లల చదువు కోసం నగదు మొత్తాన్ని డ్రా చేసి బీరువాలో భద్రపరచింది. దీంతో ఎవరికి తెలియకుండా కోటయ్య బీరువాలో డబ్బు తీసుకొని మందు తాగి కాజేశాడు. పిల్లల నోటి దగ్గర డబ్బులు మందుకు ఆగం చేశాడని భార్య నిలదీయడంతో గొడవ పడి, భార్యని కత్తితో చంపుతానని బెదిరించాడు.

Advertisement

Also read: కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!

డబ్బు లేక ఇంట్లో..

అయితే ఉదయం మద్యం కోసం డబ్బు లేక ఇంట్లో ఉన్న మోటార్‌ను తీసుకువెళ్లి అమ్ముకొని మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి పెట్రోల్ వెంట తెచ్చుకొని కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడని వారు తెలిపారు. దీంతో అప్రమత్తమైన కుటుంభ సభ్యులు క్షతగాత్రుడికి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకోసం పంపించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు అతడిని తరలించారు.

Advertisement

Also Read: గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!

Related News

గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!

మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!

కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!

నేనేంటో చంద్రబాబుకు తెలుసు.. భయపడే రకాన్ని కాదు: బోండా ఉమా హాట్ కామెంట్స్!

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!

Big Stories

Advertisement
×