E-Paper
Advertisement

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి
Advertisement

Shoaib Akhtar On IND VS PAK:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన రోజు జనాలందరూ ఇంట్లోనే కూర్చుంటారు. టీవీలకు అతుక్కుపోతారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహించాలని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ బతకాలంటే… ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సిందేనని వివరించారు. అప్పుడే ఐసీసీకి (ICC) కూడా లాభాలు వస్తాయన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని చాలామంది డిమాండ్లు చేస్తున్నారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రియాక్ట్ అయ్యారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితే చూడాలని తనకు కూడా ఉందన్నారు. ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగితే ఇంకా బాగుంటుందని వెల్లడించారు.

దుబాయ్ వేదికగా మ్యాచులు నిర్వహిస్తే… బెటర్ అన్నారు. అప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతాయని వివరించారు. దీనికోసం ఐసీసీ కృషి చేయాలని కోరారు. ప్రపంచ కప్ లు ఎన్ని నిర్వహించినా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ల ముందు జుజుబీ అంటూ హేళన చేశారు. అందుకే వరల్డ్ కప్ లు నిర్వహించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ల కోసం ప్రయత్నాలు చేయాలని ఐసీసీకి సూచనలు చేశారు షోయబ్ అక్తర్.

అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు ఎందుకు జరగడం లేదు ?

Advertisement

2008 నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఇండియాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసినందుకుగాను.. భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ దేశంలో పర్యటనలు, వాళ్లతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకూడదని దిశా నిర్దేశం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా పాక్ ప్లేయర్లు ఉండకుండా బ్యాన్ విధించింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

Related News

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

ఒరేయ్ ఆలూ అంటూ ట్రోల్స్‌…టీమిండియా అభిమానిపై ఇంజ‌మామ్ దాడి!

అస‌లు మీకు బుర్ర ఉందా..ముస‌లోడు అయ్యాక షమీని తీసుకుంటారా ?

బౌల్-అవుట్ లో ధోనికి నేనే ఆ స‌ల‌హా ఇచ్చాను..వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం !

నేను తోపు బౌల‌ర్ ను కాదు, కానీ చాలా మంది త‌ల‌ల ప‌గుల‌గొట్టాను

ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్..టీమిండియాకు ఘోర అవ‌మానం,డ్రెస్సింగ్ రూం లేకుండా చేశారు!

రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌…హిట్ మ్యాన్ పై బీసీసీఐ ప‌ర్మినెంట్ బ్యాన్ ?

CSK వెధ‌వ‌ల‌కు బుద్ది రావాల‌నే, ట్రావిస్ హెడ్ విజిల్ వేశాడు..విజిల్ సెలబ్రేషన్ పై సలీల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×