E-Paper
Advertisement

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!
Advertisement

Raghurama: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. గన్నవరం వద్ద నిర్మిస్తున్న రామాలయంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. దీనితో పాటు శాసనసభలో నిర్వహించిన పిటిషన్ల కమిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్పష్టత

Advertisement

రామాలయ నిర్మాణ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు కాపీని డిప్యూటీ స్పీకర్ చదివి వినిపించారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎటువంటి రాజకీయ కుట్ర లేదని, ఇది ఎవరి గెలుపో లేక ఓటమో కాదని పేర్కొన్నారు. స్వయంగా శ్రీరాముడే తన గుడిని కట్టించుకుంటున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. గన్నవరం సమీపంలోని ఆశ్రమం వద్ద రామాలయ రాతి పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయన్నారు. వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్, భూముల వ్యవహారంపై కమిటీ భేటీ

Advertisement

అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భాగస్వామ్యంతో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్‌-కార్డుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్లాంట్‌లో దాదాపు 1,200 ఆర్‌-కార్డులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఆ సమయంలో సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని భావించారు. బాధితుల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించి, తగిన పరిష్కారం చూపాలని కమిటీ నిర్ణయించింది.

మరోవైపు, విశాఖ గాజువాక పరిధిలో ఏపీఐఐసీ రీఫ్రాక్టరీస్‌కు చెందిన 175 ఎకరాల భూముల వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. రూ.2 వేల కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో బ్యాంకర్లు, ఫైనాన్స్ అధికారులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు.

Also Read: ఢిల్లీ వేదికగా రేవంత్, కేటీఆర్ రహస్య బంధం.. బయటపెట్టిన ఎంపీ అరవింద్!

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×