E-Paper
Advertisement

పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. చమురు విక్రయాలపై కఠిన ఆంక్షలు.. పరిమితి విధింపు!

పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. చమురు విక్రయాలపై కఠిన ఆంక్షలు.. పరిమితి విధింపు!
Advertisement

Bulk Fuel: కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ ఆర్డర్ ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఫ్యూయెల్ కొనడాన్ని 90 రోజుల పాటు పూర్తిగా బ్యాన్ చేశారు. అంతేకాకుండా రిటైల్ బంకులలో ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్‌కు ఒక రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలని, బంకుల్లో కొన్న డీజిల్‌ను తిరిగి రీసేల్ చేయకూడదని కఠినమైన రూల్స్ విధించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడంతో.. డీజిల్, పెట్రోల్ వినియోగంలో కొరత రాకుండా కేంద్రం ఈ ముందస్తు చర్యలు తీసుకుంది.

బల్క్ డీజిల్ కొనుగోళ్లకు కేంద్రం చెక్

Advertisement

ఫ్యాక్టరీలు, మాల్స్, ఐటీ పార్కులు, టెలికాం టవర్లు, భారీ రవాణా వాహనాలు ఆపరేట్ చేసే కంపెనీలు.. సాధారణంగా ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా ట్యాంకర్ల ద్వారా ఇంధనాన్ని కొనాల్సి ఉంటుంది. కానీ గత కొన్ని వారాలుగా ఈ బల్క్ కొనుగోలుదారులు తమ సొంత ట్యాంకర్లను సాధారణ జనం వెళ్లే రిటైల్ పెట్రోల్ బంకులకు పంపి వేల లీటర్ల డీజిల్‌ను కొనుగోలు చేస్తూ వస్తున్నారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో 2 నుంచి 3 రోజులకు సరిపడా స్టాక్ ఉంటుంది. కానీ బల్క్ బయ్యర్లు ఒక్కసారిగా వచ్చి భారీగా కొనేయడంతో డిమాండ్ 20% నుండి 30% పెరిగిపోయింది. దీంతో ఇటీవలి కాలంలో బంకుల్లో ఫ్యూయెల్ దొరకని పరిస్థితి ఏర్పడింది.

డీజిల్‌లో భారీ గేమ్.. రోజుకు రూ.2 లక్షల సేవింగ్!

Advertisement

అసలు ఈ బల్క్ డీజిల్ కొనడం చుట్టూ ఎక్కడ సమస్య వస్తుందో చూద్దాం. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర 103 రూపాయలుగా ఉంది. అదే సమయంలో పరిశ్రమలు, కమర్షియల్ సంస్థలు కొనే బల్క్ డీజిల్ ధర లీటరుకు సుమారు 143 రూపాయలుగా ఉంది. అంటే 40 రూపాయల వ్యత్యాసం ఉంది. ఒక బల్క్ వినియోగదారుడు రోజుకు 5 వేల లీటర్ల డీజిల్ కొంటే, సాధారణ బంకుల్లో కొనడం ద్వారా వారికి రోజుకు దాదాపు 1,96,500 రూపాయల వరకు ఆదా అవుతోంది. ఆ భారం కాస్తా ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పడుతోంది. ఈ భారీ ప్రైస్ గ్యాప్ లూప్‌హోల్‌ను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం రిటైల్ బంకుల నుంచి బల్క్ కొనుగోళ్లను అధికారికంగా నిషేధిస్తూ ఆర్డర్ ఇచ్చింది.

సబ్సిడీపై బడా బాబుల కన్ను..

అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఉన్నప్పటికీ, సామాన్యులు, రైతులు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా ప్రభుత్వం రిటైల్ ధరలను పెద్ద ఎత్తున పెంచకుండా కంట్రోల్ లో ఉంచింది. ఈ సబ్సిడీ బడా కంపెనీలు కాదు. కేవలం సాధారణ జనం కోసమేనని స్పష్టం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు తక్కువ ధరకు రిటైల్ బంకుల్లో ఫ్యూయెల్ కొని, ఎక్కువ ధరకు బయట అమ్ముకునే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ జరగకుండా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రత్యేక స్క్వాడ్‌లకు కూడా కేంద్రం ఆదేశాలిచ్చింది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ఏపీకి 38, తెలంగాణకు 26 లోక్‌సభ స్థానాలు?

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

TSSPDCL లో సరికొత్త రికార్డు.. గత లెక్కలు మించి మరీ విద్యుత్ వినియోగం

Big Stories

Advertisement
×