E-Paper
Advertisement

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు
Advertisement

Anakapalli: ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అంతా రెడీ అయ్యింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన

Advertisement

ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరగనుంది. రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ కోసం మొత్తం 5,465 ఎకరాలు కేటాయించారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

మొదటి దశ-7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశ-10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నాయి ఆ సంస్థలు. ఇందుకోసం లక్షా 35 వేల 964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

సీఎం‌ చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు రాక

ఈ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా మరో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును ఏఎంఎన్​ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూ. 11,198 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్‌గా మారనుంది.

స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ రహదారి-16తో అనుసంధానం చేసేలా నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. కనెక్టివిటీ పెంచడం, పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించారు హోం మంత్రి అనిత.

ALSO READ: గరికపాటి గుడ్డు పంచాయితీ.. చివాట్లు తినడానికి కాకపోతే.. అవసరమా మీకిది పెద్దాయన!

సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. సోమవారం కార్యక్రమానికి వేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు శంకుస్థాపన చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

2024 ఆగస్టులో మంత్రి లోకేశ్‌.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో చర్చించారు. కేవలం మూడు నెలల్లో ప్రభుత్వం భూమి కేటాయించింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారానికి కేవలం 14 నెలల్లో అన్ని అనుమతులూ వచ్చేలా చేసింది. ఫలితంగా శంకుస్థాపనకు సిద్ధమైంది.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×