Anchor Lasya New House Warming Photos: యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేస్తూ టాప్ యాంకర్‌గా ఎదిగింది. ముఖ్యంగా రవితో కలిసి చేసిన ఆమె షో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంత బుల్లితెరపై వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో వీరి కాంబోలో ఎన్నో షోలు వచ్చాయి. అలా వరుసగా టీవీ షోలు హోస్ట్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే మంజునాథ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సీక్రెట్ పెళ్లి చేసుకున్న లాస్య కొంతకాలంగా ఇండస్ట్రీలో కొనసాగింది.
ఆ తర్వాత పెళ్లి విషయాన్ని ప్రకటించి ఇక యాంకరింగ్ కి బై బై చెప్పింది. పెళ్లి తర్వాత గ్రహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటున్న ఆమె బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో సందడి చేసిన లాస్య ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాతో బాగా సంపాదిస్తున్న తరచూ ఫ్యాన్స్ కి శుభవార్తలు చెబుతుంది. ఈ క్రమంలో తాజాగా లాస్య కొత్తింటిలోకి అడుగుపెట్టింది. బుధవారం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Samantha: సమంత, రకుల్, తమన్నాకు జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు.. సీరియసైన ఎన్నికల సంఘం
బుధవారం కొత్తింట్లోకి ప్రవేశించిన లాస్య.. గృహప్రవేశానికి తన స్నేహితులను, బిగ్ బాస్ కో–కంటెస్టెంట్స్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లకు ఆహ్వానం అందించింది. వారిలో దేత్తడి హారిక, బంచిక్ బబ్లూ, నయని పావని, గీతూ రాయల్, నోయెల్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా లాస్య దిగిన ఫోటోలను, ఆమె ఇంటికి సంబంధించిన ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆమె ఫ్రెండ్ నోయెల్ కూడా లాస్యతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. “నోయల్.. మా ఇల్లు చూసి అసూయ పడతావు అని లాస్య నాతో అన్నది. అవును తను చెప్పినట్టే వారి ఇల్లు చూసి జెలసీ ఫీల్ అయ్యాను.
అంత బాగుంది లాస్య ఇల్లు. ఇలాగే మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నా” అంటూ నోయెల్ తన పోస్ట్కి రాసుకొచ్చాడు. దీంతో అంత లాస్య ఇల్లు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో లాస్యకు నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా నెల రోజుల క్రితమే లాస్య కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఆమె రెండో ఇల్లు. ఈ ఇంటిని తన తల్లిదండ్రుల కోసం కట్టించినట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల తన తండ్రికి లాస్య కొత్త కారు బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా కొత్తింటిని కట్టించి కానుకగా ఇవ్వనుందని సన్నిహితుల నుంచి సమాచారం.