Devansh: టెక్ యుగంలో పిల్లలకు క్షణం తీరిక దొరికినా అయితే సెల్‌ఫోన్.. లేదంటే టీవీ ముందు వాలిపోతారు. అల్లరి చేస్తే కాసేపు సెల్‌ఫోన్ ఇచ్చివారిని సైలెంట్‌గా కూర్చో బెడతాము. ఆ ప్రపంచం నుంచి బయటకు రావడానికి పిల్లలకు చాలా సమయం పడుతుంది. ఏ పని చేసినా చిన్నారుల మనసంతా టెక్‌పై డైవర్ట్ అవుతుంది. కానీ కనిపిస్తున్న దేవాన్ష్ అలా కాదు. వీలు చిక్కినప్పుడల్లా తాత అవ్వలతో కలిసి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
నేవీ దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ సాగర తీరంలో నేవీ విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు దంపతులు విచ్చేశారు. దీనికి మరొకరు కూడా హాజరయ్యారు. ఆ బాబు ఎవరోకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు.. మంత్రి లోకేష్ కొడుకు దేవాన్ష్.
ఆ విన్యాసాలు చూసి మురిసి పోయాడు దేవాన్ష్. తాతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు. కార్యక్రమం ప్రారంభం మొదలు చివరి వరకు అంతా ఆసక్తిగా తిలకించాడు. విన్యాసాలు చూస్తున్నంత సేపు దేవాన్ష్ ఏదో సాధించాలన్న ఆలోచన, ఆసక్తి రెండు ఆ కళ్లలో కనిపించాయి.
తనకు తెలీయని విషయాలను పక్కనేవున్న తాత నుంచి కొన్ని తెలుసుకున్నాడు. నేవీ విన్యాసాలు చూసేందుకు చాలా మంది సాగర తీరానికి వచ్చారు. కానీ కొంతమంది మాత్రం దేవాన్ష్‌ను చూస్తూ ఉండిపోయిన సన్నివేశాలు కనిపించాయి.
ALSO READ: యుద్ధభూమిని తలపించిన విశాఖ సాగర తీరం.. ప్రతిక్షణం ఉత్కంఠభరితం
ఇటీవల దేవాన్స్ చదరంగంలో ఫాస్ట్‌గా పావులు కదుపుతూ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. చిన్న వయసులో ఆ ఘనత సాధించాడు. రిసెంట్‌గా బాలకృష్ణ అన్ స్టాపబుల్‌లో షో కూడా దేవాన్ష్ కనిపించాడు. మనవడు ప్రశ్నలకు ఇద్దరు తాతలు ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణ తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే.