Navy day celebrations: నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ లో భారత నౌకాదళ వాయు విభాగం చేస్తున్న విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. విన్యాసాలను చూసేందుకు జనాలు పోటెత్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దాదాపు 8వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను అందరినీ ఆకుట్టుకునేలా ఎగరువేశారు. నౌకదళ విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి.
సాగర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు సందడి చేశాయి. ఉగ్రవాదుల నుంచి బంధీలను రక్షించే క్రమంలో యుద్ధ విన్యాసాలు, సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు సందర్శకులను ఆకట్టుకుంది. సముద్రంలో బంకర్ పేలుళ్ల ఆకట్టుకున్నాయి.
Also Read: AIIMS DEOGHAR JOBS: 107 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.68000 వరకు జీతం..
ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు సెయిలర్ల విన్యాసాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం, ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టడం, భూమి.. నీరుతో పాటు గాల్లో అటాక్స్‌ను తట్టుకునే తీరు అక్కడికి వచ్చిన ప్రజలను ఆకట్టుకుంది. వేడుకల్లో నేవీ సెయిలర్లు, పైలట్లు అనేక విన్యాసాలు చేశారు. నౌకాదళ విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.