Train Ticket Refund Rules: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన జర్నీ చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే వాళ్లు ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడుతారు. అటు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా రూల్స్ లో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. అందులో భాగంగానే అయితే, ఇకపై టికెట్ మీద పూర్తి రీఫండ్ పొందే అవకాశం కల్పిస్తున్నది. ఎలాంటి సందర్భాల్లో పూర్తి స్థాయి రీఫండ్ పొందే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైలు 3 గంటల కంటే ఆలస్యం అయితే పూర్తి రీఫండ్
తరచుగా పలు కారణాలతో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొంగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం అవుతాయి. మరికొన్ని రైళ్లను అధికారులు రద్దు కూడా చేస్తారు. అయితే, సాధారణంగా రైలు రావాల్సిన సమయానికి కంటే 3 గంటలు ఆలస్యం అయితే, టికెట్ ఛార్జీపై పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. IRCTC రూల్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రైలు రావాల్సిన సమయాని కంటే 3 గంటలు లేట్ అవుతున్నట్లు ప్రయాణీకులకు ముందుగానే తెలిస్తే, రైలు స్టేషన్ కు వచ్చే సమయాని కంటే ముందే కౌంటర్ దగ్గరికి వెళ్లి టీడీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయల్దేరాల్సిన రైలు ఉదయం 10 గంటలకు రావాల్సి ఉంటే, మీరు 10 కంటే ముందే వచ్చి టీడీఆర్ ఫామ్ నింపి కౌంటర్ లో ఇవ్వాలి. అలాంటి సమయంలో 100 శాతం టికెట్ పై రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ ప్రయాణీకులు తమ టికెట్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నట్లు అయితే, వాళ్లు.. IRCTC యాప్ లో లేదంటే వెబ్ సైట్ ద్వారా టీడీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్ణీత పని దినాల్లో పూర్తి స్థాయి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?
ఒకవేళ మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైలు ప్రయాణం చేసే సమయంలో.. వెళ్లాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ సేపు ఆలస్యం అయితే, వెంటనే రైల్వే స్టేషన్ లోని కౌంటర్ దగ్గరికి వెళ్లి టీడీఆర్ ఫైల్ చేసుకోండి. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నట్లైతే IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ ద్వారా టీడీఆర్ ఫైల్ చేసుకోండి. మీరు కూడా పూర్తి స్థాయిలో రీఫండ్ పొందే అవకాశం ఉంటుది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. వారు కూడా ఇలాంటి సందర్భాల్లో పూర్తి టికెట్ ఛార్జీని పొందేలా చూడండి.
Read Also: సంక్రాంతికి మరో 60 స్పెషల్ రైళ్లు, సౌత్ సెట్రల్ రైల్వే గుడ్ న్యూస్!