CM Chandrababu: ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దోవోస్‌లో జరిగిన ఆర్ధిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా.. ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు రోజులపాటు దావోస్‌లో ఆయా కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలు, ప్రతినిధులతో జరిపిన చర్చలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటన విశేషాలను ప్రజలకు వివరించారు. దావోస్ పర్యటన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కంపెనీలకు చెందిన ప్రతినిధులను కలిసి వారితో ఒప్పందాలు చేసుకునే వీలు కలిగిందని తెలిపారు. ఏఏ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నామో ప్రజలకు తెలియజేశారు. దావోస్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
దావోస్ కు వెళ్లాలనే ట్రెండ్ తానే సెట్ చేశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. అప్లట్లో దావోస్ అంటే.. రిచ్ పీపుల్స్ ప్లేస్ అని అనుకునేవారు. దాన్ని మార్చి తాను దోవోస్ వెళ్లానన్నారు. ఏపీ గురించి వివరించి పెట్టుబడులను ఆకర్షించాం. అప్పట్లో తాను, ఎస్ ఎం కృష్ణ పెట్టుబడుల కోసం పోటీ పడేవాళ్లం అని.. ఆయన బెంగుళూరు గురించి, తాను ఏపీ గురించి పోటీపడి చెప్పేవాళ్ళం అని వివరించారు.
ప్రంపంచ ఆర్ధిక సదస్సులో.. గ్రీన్ ఎనెర్జీ, గ్రీన్ హైడ్రోజన్ , నేచర్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకున్నాం.. ఐటీ నుంచి ఏఐ వరకూ చర్చించాం అన్నారు. వెయ్యి కి.మీ సముద్రతీరం ఏపీకి గొప్ప అవకాశం అని.. దీన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటే బ్లూ ఎకానమీ పెరుగుతుందని కొనియాడారు. ఒకప్పుడు ఐటీ అంటే.. హైటెక్ సిటీ అనేలా గుర్తింపు తీసుకొచ్చాం అని సీఎం అన్నారు. అక్కడికి వెళ్లాక తమ టీమ్‌కి చాలా ఆలోచనలు వచ్చాయి. దావోస్‌లో 27 కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయన్నారు. 1997 నుంచి దావోస్ పర్యటనకు వెళ్తూన్నాని తెలిపారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు.. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం
సచీవాలయం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2028 తర్వాత జీడీపీ వృద్ధిరేటులో చైనాను భారత్ అధిగమిస్తుంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్ కంపెనీ వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ వస్తే.. గేమ్ ఛేంజర్ అవుతుందని వెల్లడించారు. మనం జాబ్ అడగడం కాదు.. ఇచ్చే స్థితిలో ఉండాలని సీఎం వెల్లడించారు.