BigTV English
Advertisement

Actors : ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్కైన స్టార్ యాక్టర్స్… 13 మందితో పాటు ఎఫ్ఐఆర్ నమోదు

Actors : ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్కైన స్టార్ యాక్టర్స్… 13 మందితో పాటు ఎఫ్ఐఆర్ నమోదు

Actors : సెలబ్రిటీలు అన్నాక బాధ్యతతో వ్యవహరించాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందుల్లో పడక తప్పదు. తాజాగా ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఈ మేరకు కేసులో పలువురు నిందితులతో పాటు ఆ ఇద్దరు స్టార్ యాక్టర్స్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది.


ఆ స్టార్స్ యాక్టర్స్ ఎవరు ?

ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade), అలోక్ నాథ్‌ (Alok Nath) లు చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని సోనిపట్‌లోని ముర్తల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫ్రాడ్ కేసులో 13 మంది నిందితులలో ఈ ఇద్దరి పేర్లు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 22న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 316, 318, 318(4) కింద కేసు నమోదు చేశారు.


అసలేం జరిగిందంటే ?

2016లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రిజిస్టర్ అయిన ‘హ్యూమన్ వెల్ఫేర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను నిర్వహిస్తోంది. FD (ఫిక్స్‌డ్ డిపాజిట్), RD (రికరింగ్ డిపాజిట్) వంటి పొదుపు పథకాల క్రింద కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ టైమ్ కల్లా భారీ మొత్తాలను ముట్టజెబుతామను జనాలను నమ్మించారు ఈ సొసైటీ నిర్వాహకులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్టైల్ లో ఈ స్కామ్ ను మొదలు పెట్టారు. పైగా ఇందులో కొత్తగా జనాలను చేర్చే ఏజెంట్ లకు ఎంతో కొంత బోనస్ గా ఇచ్చారు.

కానీ తాజాగా ఈ సొసైటీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా చేస్తున్న కోట్లాది రూపాయల స్కామ్ ను గురించి విపుల్ అంటిల్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లయింట్ చేశారు. హ్యూమన్ వెల్ఫేర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మల్టీ లెవల్ మార్కెటింగ్ వాడుకుని, జనాలను మోసం చేస్తోందనే విషయాన్ని సోనిపట్‌కు చెందిన విపుల్ బయట పెట్టాడు. బాధితుడు విపుల్ కూడా ఈ నెట్‌వర్క్‌లో సుమారు వెయ్యి మందిని చేర్చుకున్నాడు. మొదట్లో బాగానే డబ్బులు సంపాదించారు. కానీ 2023 నాటికి పరిస్థితి మారిపోయింది. సొసైటీ అందరినీ మోసం చేసి జెండా ఎత్తేసింది.

ఈ స్కామ్ కేసులో సొసైటీ డైరెక్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌తో పాటు పలువురు అధికారులపై కేసు నమోదైంది. కేసులో పేర్కొన్న 13 మందిలో ఇండోర్‌కు చెందిన నరేంద్ర నేగి, దుబాయ్ నివాసి సమీర్ అగర్వాల్, పంకజ్ అగర్వాల్, పరీక్షిత్ పర్సే, ముంబై నివాసి ఆర్కే శెట్టి, చీఫ్ ట్రైనర్ రాజేష్ ఠాగూర్, సంజయ్ ముద్గిల్, హర్యానా హెడ్ పప్పు శర్మ, చండీగఢ్ నివాసి ఆకాష్ శ్రీవాస్తవ, రామ్‌కన్వర్ ఝా, పానిపట్ నివాసి షాబే హుస్సేన్, చెస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ ఉన్నారు. శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade), అలోక్ నాథ్‌ (Alok Nath) పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి.

స్కామ్ లో నటుల పాత్ర ఎంత ?

మరి ఈ స్కామ్ లో నటులు అలోక్ నాథ్, శ్రేయాస్ తల్పాడే శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade), అలోక్ నాథ్‌ (Alok Nath) ల పాత్ర ఏంటి? వాళ్ళు చేసిన తప్పు ఏంటి? అంటే… ఇలాంటి ఫ్రాడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అలోక్ నాథ్ హిందీలో పాపులర్ నటుడు. శ్రేయస్ కమెడియన్, అలాగే ‘పుష్ప’, ‘పుష్ప 2’కు హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×