BigTV English

Vijayasai Reddy Resign: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం

Vijayasai Reddy Resign: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం

Vijayasai Reddy Resign: అన్నట్లుగానే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్‌కు అందజేశారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు తన రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు. ఈ సమయంలో ఇరువురు మధ్య రాజకీయ అంశాలు చర్చలు వచ్చాయి. కాకపోతే వీఎస్ఆర్ ఏం మాట్లాడరనేది ఆసక్తికరంగా మారింది.


విజయసాయిరెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్ వ్యవహారం తెలియగానే అధినేత జగన్ రాయబారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శనివారం విజయసాయిరెడ్డి ఇంటిని తిరుపతి ఎంపీ గురుమూర్తి, పుల్లి సుభాస్ చంద్రబోస్‌లను  పంపారు. వీఎస్ఆర్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ఎంపీ గురుమూర్తి. ఇది ఒక విధంగా షాక్‌కు గురిచేసిందన్నారు. ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు.

వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డిని కలవడానికి వచ్చానని తెలిపారు. ఆయనతోపాటు సుభాస్ చంద్రబోస్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో తన నిర్ణయం మారదని ఖరాఖండిగా చెప్పారు. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాయని, తన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయ్యిందని సహచర ఎంపీలతో అన్నట్లు ఢిల్లీ సమాచారం. అనంతరం అక్కడి నుంచి రాజ్యసభ ఛైర్మన్ ధన్ కడ్‌ను కలిశారు.


మరోవైపు తోటి ఎంపీలతో మాట్లాడుతుండగానే విజయసాయిరెడ్డి కొత్త అవతారం ఎత్తారు. ఎప్పుడు ఏపీ రాజకీయాలు, అధికార పార్టీ నేతల గురించి తనదైన శైలిలో సెటైర్లు వేసే ఆయన, తన ఆలోచన మార్చుకున్నారు. త్వరలో దక్కకున్న కొత్త పదవి నేపథ్యంలో రూటు మార్చారు. ఏకంగా అక్రమ వలసదారులపై మనసులోని ఆవేదనను బయటపెట్టారు.

ALSO READ:  వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి

‘దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని రాసుకొచ్చారు. చాలా వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని, కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రస్తావించారు. ఈ పరిస్థితి దేశంలో శాంతి, భద్రతలకు పెను సవాలుగా వర్ణించారు.

అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని తాను కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడ కూడదన్నది తన ఆలోచనగా ప్రస్తావించారు.

వీఎస్ఆర్ ట్వీట్‌పై కొందరు నేతలు రియాక్ట్ అవుతున్నారు. రాజీనామా తర్వాత ఆయన మాటల్లో మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ మార్పుకు కారణమేంటి అంటూ చర్చించుకోవడం మొదలైంది. కమలనాధుల తరహాలో మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతలు ఈ విధంగా దేశం కోసం మాట్లాడుతారంటూ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రేపో మాపో వీఎస్ఆర్‌కు కీలక పదవి అందుకోవడం ఖాయమని అంటున్నారు.

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×