Oscar Award to Allu Arjun: ఇటీవల ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ బయటికొచ్చాయి. అప్పటినుండి అసలు ఈ నామినేషన్స్ నుండి ఎవరు గెలుస్తారు అనే చర్చలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆఫ్ స్క్రీన్ కూడా బన్నీ విపరీతంగా యాక్ట్ చేస్తున్నాడని, అందుకే తనకు కూడా ఆస్కార్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ ఇది ఏ మాత్రం సీరియస్ కాదని అర్థమవుతోంది. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించిన సందర్భంగా కొందరు నెటిజన్లు మరోసారి అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రీమియర్స్ వల్లే
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అంతకు ముందు కూడా బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా ‘పుష్ప’ తర్వాత అది అమాంతం పెరిగిపోయింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా తన మ్యానరిజంకు, స్టైల్‌కు ఫిదా అయ్యారు. అయితే ‘పుష్ప’ సీక్వెల్‌ను తెరకెక్కించడం కోసం ఆడియన్స్‌ను మూడేళ్లు వెయిట్ చేయించారు మేకర్స్. దీంతో ‘పుష్ప 2’పై ప్రేక్షకుల్లో హైప్ పూర్తిగా పోయింది. అదే సమయంలో అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి ‘పుష్ప 2’కు ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాడు. అందుకే ఈ మూవీకి ప్రీమియర్ షో నుండే హడావిడి మొదలయ్యింది. అదే బన్నీ కెరీర్‌పై బ్లాక్ మార్క్ పడేలా చేసింది.
వివరణ కోసం
‘పుష్ప 2’ ( ప్రీమియర్స్‌ను ఫ్యాన్స్‌తో కలిసి చూడాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లాడు. అప్పటికే ఆ థియేటర్ వద్ద చాలామంది ప్రేక్షకులు చేరుకోవడంతో అల్లు అర్జున్ (Allu Arjun) రాగానే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. తన కుమారుడు శ్రీ తేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ముందుగా రేవతి మృతిచెందిన విషయం తనకు అస్సలు తెలియదని రెండు రోజుల తర్వాత విడుదల చేసిన వీడియోలో తెలిపాడు బన్నీ. కానీ పోలీసులు ముందుకొచ్చి రేవతి మరణించిన విషయాన్ని అప్పటికప్పుడే అల్లు అర్జున్‌కు తెలియజేసినా తాను మాత్రం సినిమా అయ్యాకే వెళ్తానని చెప్పిన విషయం బయటపడింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వడానికి బన్నీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.
Also Read: అవును డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.. ఐటీ రైడ్స్‌పై దిల్ రాజు రియాక్షన్
బీభత్సమైన యాక్టింగ్
ప్రెస్ మీట్‌లో తనకు అసలు ప్రీమియర్స్ సమయంలో రేవతి మరణించిన విషయంపై క్లారిటీ లేదంటూ చాలా వింతంగా మాట్లాడాడు. మానసికంగా తనకు అసలు ఎలా ఆలోచించాలో అర్థం కాలేదని అన్నాడు. మధ్యమధ్యలో వాటర్ తాగుతూ తెగ ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. దీంతో ఆ ప్రెస్ మీట్ అయిపోగానే తనపై చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అసలు రేవతి మరణించినందుకు బన్నీకి కొంచెం కూడా బాధ లేదని, ప్రెస్ మీట్‌లో చేసిందంతా నటన అని నెటిజన్లు విమర్శించారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ సందర్భంగా మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రెస్ మీట్‌లో బన్నీ చేసిన నటనకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.