E-Paper
Advertisement

CM Chandrababu: ఫైనల్‌గా ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఏమన్నాడంటే..?

CM Chandrababu: ఫైనల్‌గా ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఏమన్నాడంటే..?
Advertisement

CM Chandrababu: దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. సమస్య తీవ్రత, సంస్థ వైఫల్యాన్ని ముఖ్యంగా ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించలేదని.. సరైన సమయం ఇచ్చినా తమ లోపాలను సరిదిద్దుకోలేకపోయిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ సమస్యపై గతంలోనే ఒక నివేదిక ఇచ్చిందనే విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యాన్ని ఆ నివేదిక పరోక్షంగా ఎత్తిచూపినట్లు అయ్యింది. పైలట్ల పని వేళలు, వారికి కల్పించాల్సిన విశ్రాంతి విషయంలో సంస్థ కఠినమైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఇండిగో విమానయాన సంస్థ వైఫల్యాన్ని సూటిగా విమర్శించారు. ‘ఇండిగో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించలేదు. వారికి తగినంత సమయం ఇచ్చినా.. ఆ సమయంలో కూడా వారు తమ కార్యాచరణలో మార్పులు చేయలేకపోయారు’ అని ఆయన అన్నారు. సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణా లోపాల కారణంగానే అనేక విమానాలు రద్దయ్యాయి. ఈ రద్దుల ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్లు రద్దు చేసుకున్నా.. గమ్యస్థానాలకు చేరుకోలేకపోయినా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం, క్షమాపణలు చెబితే పోయేది కాదని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం క్షమాపణలు చెబితే ఈ సమస్యకు పరిష్కారం లభించదనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Advertisement

సీఎం చంద్రబాబు పైలట్ల సంక్షేమం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుదీర్ఘ పని గంటలు, సరైన విశ్రాంతి లేకపోవడం విమాన భద్రతకే ముప్పు అని ఆయన హెచ్చరించారు. ‘పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి అవసరం. వారి ఆరోగ్యం, మానసిక స్థితి విమానయాన భద్రతకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మానిటరింగ్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేను దీనిని వ్యక్తిగతంగా ఏం మానిటరింగ్ చేయడం లేదు’ అని చెబుతూ.. ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ సమస్యను కేంద్రం పర్యవేక్షిస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సంక్షోభ నివారణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.

సమస్య మూలకారణాన్ని విశ్లేషిస్తూ.. ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపత్యం (మోనోపాలి) వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలంగా వాదించారు. దేశీయ విమానయాన రంగంలో ఒకే సంస్థకు విపరీతమైన ఆధిపత్యం ఉండటం వల్ల, సంస్థ తమ లోపాలను సరిదిద్దుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పోటీ లేకపోవడం ప్రయాణికుల సేవలకు, భద్రతా ప్రమాణాలకు హాని కలిగిస్తుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ సంక్షోభం ఇండిగో సంస్థ తమ కార్యాచరణ విధానాలను, పైలట్ల విశ్రాంతి షెడ్యూళ్లను తక్షణమే సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసిందని ఆయన అన్నారు.

Advertisement

ALSO READ: Harassment: డౌట్లు తీరుస్తానంటూ అమ్మాయిల భుజాలు తడుముతోన్న టీచర్.. పేరెంట్స్ ఏం చేశారంటే?

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×