CM Chandrababu Review: ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు వివిధ జిల్లాల్లో కురుస్తున్నాయి. వర్షాలకు తోడు బలమైన ఈదురు గాలులు తోడు కావడంతో చెట్లు ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి. తుఫాను పరిస్థితి ఎప్పుడు అంచనా వేస్తున్న సీఎం చంద్రబాబు వివిధ జిల్లాల కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం చేస్తోంది. ప్రస్తుతం ఈ అర్నబ్ తుఫాను పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతోంది. ఈ క్రమంలో తీరప్రాంత నగరాలు ఉమ్మడి విశాఖ, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. యానాంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఎటుచూసినా బలమైన గాలులు, భారీ వర్షాలు కనిపిస్తున్నాయి.
అటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులకు నగరం బలమైన చెట్లు కూలిపోయాయి. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిపై భారీ చెట్టు కూలిపోయింది. వాటిని తొలగించి ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి మున్సిపల్, విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
అర్నబ్ తుఫాను ప్రభావంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భారీ వర్షాల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ సమీపంలోని యానాం కు 167 కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని తెలిపారు. గడచిన ఆరు గంటలుగా తీరం వైపు 23 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని వివరించారు.
ALSO READ: ఉద్ధృతంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ!
అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు.
అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు, హోర్డింగులతో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
#WATCH | Visakhapatnam, Andhra Pradesh: Strong gales from Cyclone Arnab uprooted trees across the city.
A massive tree fell on a house within the Maharanipeta P.S. limits as municipal and disaster response teams initiated emergency clearing operations to restore traffic. pic.twitter.com/qvB6qfGqSS
— ANI (@ANI) October 27, 2026
Kakinada – Visuals emerging from the coastal city of Kakinada and adjoining Yanam show rough seas, squally winds, and heavy rainfall as Severe Cyclonic Storm 'Arnab' advances northwest wards over the West central Bay of Bengal. pic.twitter.com/F37gc70cpG
— NextMinute News (@nextminutenews7) October 27, 2026