Train Cancellations: అర్నబ్ తుఫాన్ హెచ్చరికలతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. దీంతో నేడు 10 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి హౌరా, భువనేశ్వర్, విశాఖ పట్నం వెళ్లే పలు రైళ్లను రద్దు దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.
హైదరాబాద్ – విశాఖ పట్నం, మహబూబ్నగర్ – విశాఖపట్నం, లింగంపల్లి – కాకినాడ, లింగంపల్లి – నర్సాపూర్, నాందేడ్ – సంబల్ పూర్, చర్లపల్లి – శ్రీకాకుళం రైళ్లు రద్దు అయ్యాయి. వీటితో పాటుగా వైజాగ్-సికింద్రబాద్ గరీబ్ రథ్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా అధికారులు రద్దు చేశారు. వీటితో పాటుగా తెలంగాణలోని ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కూడా నేడు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీ లో బాపట్ల, విశాఖపట్నం యానాం సమీపంగుండా అర్నబ్ తుఫాన్ తీరం దాటనుంది. దీంతో ప్రభుత్వ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించినున్నట్టు రైల్వే జీఎం అధికారి తెలిపారు. ప్రమాదకర రైల్వే వంతెనలను, ట్రాక్‌ల ను గుర్తించి పెట్రోలింగ్ చేయాలని జీఎం అధికారులకు సూచించారు. కాజీ పేట్, డోర్నకల్ ప్రాంతాల్లో ఇసుక సంచులు, రక్షణ సామాగ్రి, వైద్య పరికరాలు సిద్ధం చేసుకోవాలని జీఎం అధికారులకు సూచించారు.
Also read: ఉద్ధృతంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ!