E-Paper
Advertisement

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. EPDCL ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు జారీ!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. EPDCL ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు జారీ!
Advertisement

Cyclone Preparedness: EPDCL ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్నబ్ తుపాను సంసిద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గొట్టిపాటి పలు కీలక సూచలనలు చేశారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియమించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో..

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎండీల క్షేత్రస్థాయి పర్యటనకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామాగ్రిని విద్యుత్ శాఖ అందుబాటులో ఉంచింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేలా ప్రణాళికలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తుపానుకు విద్యుత్ లైన్ల పై పడే చెట్టు, మొక్కలను ను క్లియర్ చేసేందుకు యంత్రాలను అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

విధుల కేటాయింపు..

Advertisement

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కోసం 6 వేల మంది సిబ్బందిని విద్యుత్ శాఖ మోహరించింది. EPDCL నుంచి 4వేలు, SPDCL నుంచి 1,000, CPDCL నుంచి 1,000 సిబ్బందికి విధుల కేటాయింపు చేసింది. దీంతో తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టారు. రెవెన్యూ, సచివాలయం, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని మంత్రి ఆదేశించారు. తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి తెలిపారు.

1912 కాల్ సెంటర్..

రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు ఏర్పడితే తక్షణమే 1912 కి సమాచారం అందించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. తెగిపోయిన విద్యుత్ తీగలు, కండక్టర్లను చేతులతో తాకరాదు, తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. 1912 కాల్ సెంటర్ ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని సీఎండీని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఒకేసారి 30 వేలకు పైగా కాల్స్ తీసుకునేలా కాల్ సెంటర్ ను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కోన్నారు.

Advertisement

Also Read: బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Tags

Related News

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం.. రంగంలోకి దిగిన బృందాలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఉద్ధృతంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ!

జగన్ 2.0 చూపిస్తే.. 10 X చూపిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్, పరిధి దాటితే యాక్షన్ తప్పదంటూ..

నేను ఎట్లాగూ మడిచాను.. ఎంతమంది వస్తారో రావాలి, సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్

ముద్దులు, హగ్గులతో ఓట్లు రావు.. వైసీపీకి మాస్ పంచ్ ఇచ్చిన మంత్రి టి.జి. భరత్!

జగన్ ఆలోచన ప్యాలెస్ కోసం.. సిద్ధాంతం కూడా అదే, ఆ లాజిక్ మరిచి ఎలా మాట్లాడుతున్నారు- సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×