Pawan Vs Jagan: తాము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూస్తారంటూ పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూటమి నేతలు ధీటుగా బదులిచ్చారు. ఈ విషయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసింత ఘాటుగా స్పందించారు. తాము 10 X చూపిస్తామని బదులిచ్చారు.
స్థానిక సంస్థలు ఎన్నికల వేళ అధికార కూటమి-విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల సవాళ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం మీడియా ముందుకొచ్చారు కూటమి పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాదవ్. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు తనదైన శైలిలో నోరు విప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్. గతంలో 1.0 చూపిస్తే మేము ఎలా ఎదుర్కొన్నామో చూపించామన్నారు.
అలాంటి హింస చూపిస్తే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎల నిలబడాలో, ప్రజలకు ఎలా రక్షణ కవచంలా ఉండాలో మాకు తెలుసన్నారు. జగన్ 2.0 చూపిస్తే, ఎన్డీయే 10 X చూపిస్తుందన్నారు. కేవలం బలహీనులు మాత్రమే బెదిరిస్తారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బలవంతుడు ఎప్పుడూ బెదిరించని అన్నారు.
అదే సమయంలో పార్టీలో రెబెల్స్ నేతలు నామినేషన్లపైనా స్పందించారు. ఎవరైనా పరిధి దాటితే కూటమిలోని నేతలు యాక్షన్ తీసుకుంటామని తేల్చి చెప్పేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పార్టీ పెట్టినప్పుడు ఇది పాతికేళ్ల ప్రయాణం అని చెప్పానని, అందరికీ అనుభవం రావాలన్నారు. కానీ కొందరు నేతలు నామినేషన్లు వేశారని అన్నారు. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయ్యాలో తర్జనభర్జన నేపథ్యంలో నామినేషన్లు వేశారన్నారు.
ALSO READ: నేను ఎట్లాగూ మడిచాను.. ఎంతమంది వస్తారో రావాలి, సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్
టీడీపీ పెట్టినప్పటి నుంచి సంస్థాగతంగా ఇంత Exercise చేయలేదన్నారు. కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడిని చంద్రబాబు, లోకేష్, నేను తీసుకున్నామని వారిని అన్యాయం జరగకుండా చూశామన్నారు. రెబల్స్‌కు ఎక్కడా ఛాన్స్ లేదని తెగేసి చెప్పేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మమ్మల్ని ఎక్కడా తూలనాడలేదన్నారు. ఎక్కడా కూటమి స్పూర్తి దెబ్బ తినలేదన్నారు. ప్రజలు నమ్మకంతో 94 శాతం ఇచ్చారని, అది ఎక్కడా దెబ్బ తినకుండా చేశామన్నారు. పార్టీ తరపున బీఫారమ్ మేమే ఇవ్వాలన్నారు.