YS Family: వైఏస్ కుటుంభంలో మరో సారీ ఆస్తుల పంచాయతీ రచ్చకెక్కిందా.. ఓ పక్క వైఎస్ షర్మిల, మరో పక్క జగన్ ఇప్పటికే ఆస్థులకోసం తీవ్ర వివాదాలకు తెరలేపిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం వైఎస్ షర్మిలకు జగన్ భార్య అయిన వైఎస్ భారతీ ఆస్తుల వివాదానికి సంభందించిన అంశాన్ని, వైఎస్ భారతి షర్మిలకు లేఖ రాసినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది.
అయితే ఈ లేఖలో ముఖ్యంగా వైస్ భారతీ షర్మిలకు కొన్ని ఆస్థులపై ఎలాంటి హక్కులు లేవంటూ లేఖలో పేర్కోంది. మన కుటుంబంలో ఆస్తుల విషయం జరుగుతున్న చర్చలు, వివాదాల కారణంగా కొన్ని నిజాలను నీ దృష్టికి తీసుకురావాలని తెలుపుతున్నానని భారతి తెలిపింది. దీంతో కొన్ని ఆస్తులతో నీకు ఎలాంటి సంబంధం లేదంటూ వైఎస్ భారతి షర్మిలకు లేఖలో తెలిపింది.
ఈ ఆస్తులు నా పుట్టింటి వారైన మా తల్లితండ్రులు నాకు ఇచ్చారని దీనితో పాటు నా కష్టార్జితంతో కొంత నేను సంపాదించుకున్నానని భారతి తెలిపింది. అయితే వీటిపై నీకు ఎలాంటి హక్కుల లేవని దయచేసి నా పుట్టింటి ఆస్తులు, నా సొంత వాటిని వివాదాల్లోకి లాగవద్దని వైఎస్ షర్మిలను భారతీ కోరినట్టుగా లేఖలో పేర్కోన్నారు. దీంతో ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ వ్యాప్తంగా వైఎస్ ఫ్యామిలీలో మళ్లీ ఆస్తుల వివాదాలు మరోసారీ రచ్చకెక్క నున్నాయా అన్నట్టుగా అటు కూటమి పార్టీ నేతలు, వైసీపీలో కొంత మంది సీనియన్ నాయకుల అనుకుంటున్నారు.
Also read: ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం.. రంగంలోకి దిగిన బృందాలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు