Visakha CII Summit: ఏ పనిలోనైనా నమ్మకమైన భాగస్వామి ఉండాలన్నారు, ఆ తర్వాత విజయాలు తథ్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం నూతన సాంకేతికతకు అవకాశాలు చాలా ఉన్నాయన్నారు. ఈ మధ్యకాలంలో ప్రధానంగా డేటా సెంటర్లు, ఏరో స్పేస్ వంటి పదాలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేదిక కానుందన్నారు.
దేశంలోనే అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, అపార అవకాశాలకు ఏపీ ముఖ్యమైన ప్రాంతంగా చెప్పారు. భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో ఏపీ వాటా 160 గిగావాట్ల ఉంటుందన్నారు. నా నాయకత్వంలో సుమారు 8 సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామన్నారు. నమ్మకంతో ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని వివరించారు.
విశాఖ వేదికగా గురువారం నుంచి రెండురోజుల పాటు సీఐఐ సదస్సు జరుగుతోంది. దీనికి వివిధ దేశాల నుంచి మంత్రులు, 40 మంది అంతర్జాతీయ వక్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో మొదటి హైడ్రోజన్ వ్యాలీకి ఏపీ వేదికైందన్నారు. భవిష్యత్తులో కొత్త సంస్కరణలకు తిరుపతి స్పేస్ సిటీ వేదిక కానుందన్నారు.
త్వరలో డ్రోన్ ఎయిర్ టాక్సీలు రానున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల కిందట 22. 6 లక్షల కోట్లకు సంబంధించి 714 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 7.3 లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు గ్రౌండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండున్నరేళ్లు పెట్టుబడుల్లో పురోగతి సాధిస్తూ వచ్చామన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.
ALSO READ: విశాఖలో సీఐఐ సదస్సులో నేతల సందడి! డోలు వాయించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్