Visakha CII Summit: విశాఖ సాగరతీరంలో రెండు రోజుల సీఐఐ ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు వచ్చే వివిధ దేశాల నేతలు, వ్యాపారవేత్తలకు స్థానిక సాంప్రదాయం పద్దతి స్వాగతం పలికారు. ఆ సన్నివేశాన్ని చూసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపు డోలు వాయించారు.
విశాఖ సాగర తీరంలో రెండురోజుల సీఐఐ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. గురవారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడికి చేరుకున్నారు. సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులు, వ్యాపార వేత్తలకు స్వాగతం పలికారు. అదే సమయంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఏపీ ప్రభుత్వ అధినేతలు స్వాగతం పలికారు. థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యంతో డప్పులతో అతిధులకు స్వాగతం పలికారు కళాకారులు.
ఆ సన్నివేశాన్ని గమనించిన ప్రభుత్వ పెద్దలు, కళాకారుల నుంచి డోలు తీసుకుని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపు అలరించారు. ఆ సన్నివేశం అక్కడికి వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియాలో జరిగిన సీఐఐ సదస్సుకు అతిధులకు స్వాగతం పలికి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా స్థానిక కళలకు ప్రయార్టీ ఇస్తూ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మంచి సంప్రదాయంగా చెబుతున్నారు అతిధులు.
#CIIPartnershipSummit2026 | Union Ministers Piyush Goyal, Ram Mohan Naidu, CM Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan attend the inaugural session of the 31st CII Partnership Summit 2026 in Vizag@NewIndianXpress @PrabhuChawla @PiyushGoyal @ncbn @RamMNK pic.twitter.com/RFLPBLOrJN
— TNIE Andhra Pradesh (@xpressandhra) November 12, 2026