Actress Thulasi : సినీ ఇండస్ట్రీలోని కొందరు సీనియర్ హీరోయిన్లు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిందే. 50 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకుని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అలనాటి నటి సితార ఒకరు. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలనాటి నటి సితార లాంటి అందమైన నటి ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈమె ఎందుకు ఇన్నేళ్లు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు అన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలాగే మిగిలిపోయింది. మరి నటి తులసి ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎంట్రీ అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం..
కేరళలో పుట్టి పెరిగిన నటి సితార గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈమె 9వ తరగతి చదువుతున్నప్పుడే మలయాళ సినిమాల్లో అవకాశాలు రావడంతో అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన ఈ నటి ఆ తర్వాత హీరోయిన్ గా అలాగే సైడ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. 1990లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రంతో పరిచయమై తొలి సినిమాతోనే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. చిన్నతనం నుంచే ప్రతి విషయంలో తండ్రి మార్గదర్శకత్వాన్ని, సలహాలను తీసుకుంటూ పెరిగారు. అయితే ఒకానొక సందర్భంలో తండ్రి మరణం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ ఘటనతో కొన్నేళ్లు సినిమాలకి దూరమవడంతో పాటుగా మానసికంగా ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే పెళ్లికి దూరమైనట్లు చెప్పేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..
కెరీర్ తొలినాళ్ళలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈమె.. హీరోయిన్ గా మాత్రమే కాదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ‘స్నేహం కోసం’, ‘బృందావనం’, ‘లెజెండ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయి. కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు బుల్లితెరపై కూడా ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా అభిమానులుగా కూడా మార్చింది. ప్రస్తుతం తన వయసుకు తగ్గట్టుగా తల్లి పాత్రలు చేస్తూ బిజీగా మారుతుంది. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది సితార .. ఇకముందు ఎలాంటి ప్రాజెక్టులలో నటిస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది.
Also Read :కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?