E-Paper
Advertisement

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్
Advertisement

KA Paul: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి.. మళ్లీ కొత్త పార్టీ పెట్టడమేంటని విజయసాయి రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు సాయిరెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, అసలు రాజకీయాల్లోకి మళ్లీ ఎందుకు రావాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 3 లక్షల కోట్ల దోపిడీ ఆరోపణలు

Advertisement

విజయసాయి రెడ్డి రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు లెక్కలేనన్ని భూములు సంపాదించారని.. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. దోచుకున్నది, దాచుకున్నది చాలక మళ్లీ దోచుకోవడానికే పార్టీ పెడుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ ఏజెంట్.. జగన్ కాళ్లపై పడాలి!

Advertisement

సాయిరెడ్డిని బీజేపీ పంపిన ఏజెంట్‌గా కేఏ పాల్ అభివర్ణించారు. కేవలం జగన్ మోహన్ రెడ్డి ఓట్లను చీల్చడానికే ఆయనను రంగంలోకి దించారని వ్యాఖ్యానించారు. ‘నువ్వు ఎవరు వదిలిన బాణానివి? బుద్ధి ఉన్నవాడెవరూ నీకు ఓటు వేయరు. వెళ్లి జగన్ కాళ్ల మీద పడి, ఆయన దయతో సంపాదించిన లక్షల కోట్లను ప్రజలకు పంచు’ అని ఘాటుగా హితవు పలికారు.

మీ రెడ్లే ఏలాలా.. మాకు చేతకాదా?

రాష్ట్రంలో దాదాపు 80 ఏళ్లుగా 12 మంది రెడ్లే ఏలారని, 60 శాతం ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సీఎం పీఠం ఎందుకు ఇవ్వలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. పాలించడం మాకు చేతకాదా అని నిలదీశారు. బహుజనులందరం ఏకమై ఈ కుల, కుటుంబ పార్టీల పాలనకు అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Tags

Related News

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్‌ లైన్‌కు తగినట్లే జెండా!

కేబినెట్ నుంచి పలువురికి ఉద్వాసన! నారా లోకేశ్ గరంగరం, మంత్రులతో స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

Big Stories

Advertisement
×