Big Stories

CM Jagan: పులిహోర మేనిఫెస్టో.. మహానాడు డ్రామా.. బాబుపై జగన్ అటాక్

jagan

CM Jagan: ఇటీవల రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. ఆ వేదికగా మినీ మేనిఫెస్టో పేరుతో పలు హామీలు ప్రకటించారు చంద్రబాబు. ఆ మహానాడు తర్వాత.. పత్తికొండలో సీఎం జగన్ తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ఇంకే ముంది? టీడీపీని, చంద్రబాబును, మేనిఫెస్టోను ఎడాపెడా ఏకిపరేశారు. ఘాటైన వ్యాఖ్యలతో, పదునైన విమర్శలతో చెడుగుడు ఆడుకున్నారు జగన్.

- Advertisement -

చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని.. అక్కడి రెండు పార్టీల మేనిఫెస్టోతో బిస్బిల్లా బాత్ వండేశారని సెటైర్లు వేశారు. మన పథకాలను కాపీ కొట్టి పులిహోర వండేశారని పంచ్‌లు విసిరారు. చంద్రబాబు బతుకే కాపీ, మోసం అంటూ విరుచుకుపడ్డారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని విమర్శించిన జగన్… పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలిగిన పార్టీ టీడీపీ అని అన్నారు.

- Advertisement -

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడు.. చంద్రబాబుకు ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంతకన్నా లేదు.. పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరు.. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు, ఏ గడ్డైనా తింటారు.. ఇలా ఘాటుగా, నాటుగా సాగింది జగన్ ప్రసంగం.

ఆ మహానాడును ఓ డ్రామా కంపెనీగా నడిపారని మండిపడ్డారు సీఎం జగన్. వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తినే యుగపురుషుడు, దేవుడు అంటూ కీర్తిస్తూ డ్రామా నడిపించారని ఎద్దేవా చేశారు. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడని.. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడని సెటైర్లు వేశారు.

మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటున్నారు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు.. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబులిటీ ఉంటుంది.. కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారు.. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదంటూ సీఎం జగన్‌ విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్యాన్ని పలకరు, ధర్మానికి కట్టుబడరు.. ఆయనకు విలువలు లేవు, విశ్వసనీయత లేదన్నారు జగన్. చంద్రబాబు, గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటం.. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికి వారి పోరాటం.. రాబోయే రోజుల్లో ఓ యుద్ధం జరగబోతోందన్నారు జగన్.

కర్నూలు జిల్లా పత్తికొండ బహిరంగ సభలో.. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో.. బటన్ నొక్కి నగదు జమ చేశారు సీఎం జగన్. మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా.. రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా అందిస్తున్నామని జగన్ చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News