Big Stories

Underground Lab : అండర్‌గ్రౌండ్‌లో ల్యాబ్.. 1 కిలోమీటర్ లోతులో..

Underground Lab : భూమి కాకుండా మానవాళి ఇతర గ్రహాలపై జీవించలేదా..? ఇది శాస్త్రవేత్తలకు ఎంతోకాలంగా కలవరపెడుతున్న ప్రశ్న. ఇప్పటికే భూమి అనేది కాలుష్యంతో నిండిపోయింది, ఎన్నో హానికరమైన గ్యాసులు గాలిలో విడుదల అవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే వెంటనే భూమి కాకుండా మానవాళి జీవనాన్ని సపోర్ట్ చేసే మరో గ్రహాన్ని కనుక్కోవడం శాస్త్రవేత్తలు తప్పని విషయంగా మారింది. అందుకే దానికోసం ఒక కొత్త రకమైన ప్రయోగాన్ని వారు ప్రారంభించనున్నారు.

- Advertisement -

మార్స్‌పై, మూన్‌పై ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం శాస్త్రవేత్తలు 1.1 కిలోమీటర్ల లోపలికి ఒక స్వరంగాన్ని తవ్వారు. అక్కడ ఒక అండర్‌గ్రౌండ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. భూమిపై కాకుండా ప్రపంచంలోని ఇంకా ఏ చోట అయినా కూడా మానవాళి ఎలా జీవిస్తుంది అనే విషయంపై ఇక్కడ పరీక్షలు జరగనున్నాయి. దీనికే బయో స్పియర్ అని పేరుపెట్టారు. ఈ ల్యాబ్‌ను తాజాగా లాంచ్ చేశారు శాస్త్రవేత్తలు. ఇది యూకేలోని లోతైన మైన్ సైట్స్‌లో ఒకటి అని వారు బయటపెట్టారు.

- Advertisement -

మూన్, మార్స్‌పై ఉండాలంటే ఎలాంటి వాతావరణంలో జీవించాలో.. అలాంటి వాతావరణాన్ని బయో స్పియర్‌లో క్రియేట్ చేశారు. రిమోట్‌నెస్, ఎక్కువగా వనరులు అందుబాటులో లేకపోవడం, భారీ వస్తువులను అటు ఇటు కదిలించడానికి స్వయంగా కష్టపడడం.. ఇలాంటివన్నీ బయో స్పియల్‌లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు అక్కడ అల్ట్రా సౌండ్ రేడియోషన్ కూడా ఏర్పాటయ్యింది. అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాల్లో రేడియేషన్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఇది రిమోట్ ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు జీవనం ఎలా కొనసాగుతుంది అనే విషయంపై బయో స్పియర్ పూర్తిగా క్లారిటీ ఇస్తుంది. ఇప్పటికే అమెరికా కూడా ఇలాంటి ఒక ప్రయోగానికి సిద్ధపడింది. మూన్‌పై మనుషులు జీవించాలంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక క్యూబ్ లాంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికి భిన్నంగా యూకే ఈ అండర్‌గ్రౌండ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ఇతర దేశాల శాస్త్రవేత్తల దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో వారు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News