BigTV English

CM Jagan : గిరిజనులకు గూడ్ న్యూస్.. 300 సెల్ టవర్లు ఒకేసారి ప్రారంభం..

CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన టెలికాం సేవలు అందించాలని సీఎం జగన్ తెలిపారు. దీనిలో భాగంగా ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, ప్రకాశంలో 4,కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటు చేశారు.

CM Jagan : గిరిజనులకు గూడ్ న్యూస్.. 300 సెల్ టవర్లు ఒకేసారి ప్రారంభం..

CM Jagan : ఏపీ సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన టెలికాం సేవలు అందించాలని ఆయన తెలిపారు. ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, ప్రకాశంలో 4, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటు చేశారు.


గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించాలనే లక్ష్యంతో నూతనంగా 300 టవర్లని ప్రారంభించామని సీఎం జగన్ ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణానికి 400 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. 400 టవర్లు ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరమని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగమని ప్రకటించారు. మొత్తంగా కలిపి 2,887 టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి రూ.3,119 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములను వెంటనే టెలికాం సంస్థలకు కేటాయించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా 5,549 గ్రామాలకు పూర్తి స్థాయిలో మొబైల్‌ టెలికాం సేవలు అందుతాయన్నారు. ఇప్పటి వరకు సీగ్నల్ లేని అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయని హర్షం వ్యక్తం చేశారు.


సెల్ టవర్లు అందుబాటులోకి రావడం వల్ల మారుమూల గిరిజన ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతాయని వెల్లడించారు. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు, ఇంగ్లిషు మీడియం స్కూల్స్‌ లో మెరుగైనా సిగ్నల్ వ్యవస్థ ఉంటుందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన టవర్లు ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని వెల్లడించారు. ఆన్ లైన్ సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు, కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, పాల్గొన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×