Big Stories

AP CM Jagan: చంద్రబాబుకు ఓటు వేస్తే పదేళ్లు వెనక్కి వెళ్లిపోతాం.. సీఎం జగన్

AP CM JaganAP CM Jagan: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నంద్యాలలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలో పొత్తులపై సంచలన విమర్శలు చేశారు. తాను ఒంటరిగా ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తున్నానని తెలిపారు. అయితే తనని ఓడించడానికి తోడేళ్లన్నీ ఎకమయ్యాయని విమర్శించారు.

- Advertisement -

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని అన్నారు. మోసాలకు పాల్పడే చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. మోసాలు తప్ప మరేం చేయలేదన్నారు.

- Advertisement -

చంద్రబాబుకు ఓటు వేస్తే పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని జగన్ విమర్శించారు. తమ వైసీపీ పాలనలో మూడు రాజధానులు నిర్మించామ్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి స్కీమ్ కూడా తీసుకురాలేదన్నారు. చంద్రబాబు పేరు ఎత్తితేనే వ్యవసాయం దండగ అనే మాట గుర్తుకు వస్తుందని దుయ్యబట్టారు. బాబు వస్తే కరువు వస్తుందని గుర్తుకు వస్తుందన్నారు.

Also Read: YS Sunitha Comments On Jagan: వైసీపీని ఓడించండి.. మరోసారి వైఎస్ సునీత పిలుపు..

చంద్రబాబుకు ఓటు వెయ్యవద్దని జగన్ ప్రజలను కోరారు. 2019లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అదే తామ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిందన్నారు. వైసీపీ పాలనలో ఆర్బీకేలు, సచివాలయాలు, స్కూళ్లు నిర్మించామని.. మరి గతంలో చంద్రబాబు వాటిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News