BigTV English

CM Jagan Master Sketch : ఈస్ట్‌లో బూస్ట్.. జగన్ కీ డెసిషన్..|

CM Jagan Master Sketch : ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైసిపి పావులు కదుపుతున్న తీరు చూస్తే చదరంగాన్ని తలపిస్తోంది.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చుతూ రాజకీయ క్రీడ కొనసాగిస్తోంది.. సొంతగా సర్వేలు చేయించుకుంటూ.. ఆ రిపోర్టుల మేరకు సిట్టింగులతో పాటు ఇన్‌చార్జ్‌లను కూడా మార్చేస్తున్నారు జగన్.. ఆయన స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో కాని.. పార్టీ శ్రేణుల్లో మాత్రం పెద్ద గందరగోళమే కనిపిస్తోందిప్పుడు

CM Jagan Master Sketch : ఈస్ట్‌లో బూస్ట్.. జగన్ కీ డెసిషన్..|

CM Jagan Master Sketch : ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైసిపి పావులు కదుపుతున్న తీరు చూస్తే చదరంగాన్ని తలపిస్తోంది.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చుతూ రాజకీయ క్రీడ కొనసాగిస్తోంది. సొంతగా సర్వేలు చేయించుకుంటూ.. ఆ రిపోర్టుల మేరకు సిట్టింగులతో పాటు ఇన్‌చార్జ్‌లను కూడా మార్చేస్తున్నారు జగన్.. ఆయన స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో కాని.. పార్టీ శ్రేణుల్లో మాత్రం పెద్ద గందరగోళమే కనిపిస్తోందిప్పుడు.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి , కాకినాడ ఎంపీలను.. ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టనున్నారు వైసీపీ అధినేత జగన్.. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్‌ను రాజమండ్రి సిటీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు.. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం సమన్వయకర్త బాధ్యతలు కట్టబెట్టారు. దాంతో ఆ ఇద్దరు ఎంపీలు ఈ సారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగడం ఖాయమైంది. దానికి తోడు జిల్లాలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసలు సీట్లే ఇవ్వలేదు.

రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ మొదటి నుంచి కూడా రాజమండ్రి సిటీ పైనే దృష్టి సారించారు. లోక్ సభ సభ్యునిగా ఏడు నియోజకవర్గాలు తన పరిధిలో ఉన్నప్పటికీ కేవలం అయిన రాజమండ్రి మీదే మొదటి నుంచి ఫోకస్ చేస్తూ వచ్చారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈయనకు మంత్రిగా పనిచేయాలని కోరిక బలంగా ఉందట. మరో వైపు టిడిపి మార్గని భరత్ అవినీతిపరుడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది.


అలాగే రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు మార్గాన్ని భరత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. భరత్ ఎంపీ అయిన దగ్గర నుంచి తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట. ఈ నేపథ్యంలో 7 నియోజకవర్గాల అభ్యర్థులతోనూ సమన్వయంగా ముందుకు వెళ్లే వ్యక్తి కోసం వైసిపి వేట ప్రారంభించింది. భరత్‌కు ఆయన ఆశిస్తున్న రాజమండ్రి సీటు ఖాయం చేసింది.

కాకినాడ ఎంపీ వంగా గీతకు మొదటి నుంచి పిఠాపురంలో మంచి పట్టు ఉంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ కాపు అభ్యర్థిని నిలబెడితే గెలుపు తథ్యం అని వైసిపి భీమా వ్యక్తం చేస్తోంది. దాంతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో అందరికీ ఆమె అందుబాటులో ఉంటారన్న పేరుంది. ఇంచుమించుగా అన్ని గ్రామాల్లోనూ వ్యక్తులతో పేర్లు పెట్టి పిలిచి మరీ మాట్లాడతారట.

దానికి తోడు కాకినాడ ఎంపీగా మరింత బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని వైసిపి ఆలోచిస్తుందని సమాచారం. గత ఎన్నికల్లో వంగా గీత జగన్ హవాలో గెలిచారు కానీ ఎంపీ అభ్యర్థికి ఆమె సూటబుల్ కాదని సర్వే రిపోర్టులు స్పష్టం చేశాయంట. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను కాకినాడ నుంచి పిఠాపురం తరలించినట్లుగా తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ మార్పులు ఎవరికి మేలు చేస్తాయో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×