BigTV English

Purandeswari : పొత్తులపై అధిష్టానికి వివరిస్తాం.. అధిష్టాన నిర్ణయమే పైనల్.. పురందేశ్వరి..

Purandeswari : రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఏపీ బీజేపీ నేతల కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండో రోజు పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

జనసేన పార్టీ మా మిత్రపక్ష పార్టీ అన పురందేశ్వరి అన్నారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు? మా పార్టీ బలోపేతం కోసం మేం పనిచేస్తామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని పురందేశ్వరి తెలిపారు. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తామన్నారు. అంతిమ నిర్ణయం అధిష్ఠానానికే వదిలేస్తున్నామని ఆమె తెలిపారు.

ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించామని జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడతామన్నారు. బీజేపీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బీజేపీలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొత్తుల అంశంపై సమావేశంలో చర్చించామని తెలిపారు. పొత్తుల అంశంపై మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదన్నారు.

మాతో పొత్తు పెట్టుకోవాలనుకొనే వారు కూడా స్పందించాలని సత్యకుమార్ తెలిపారు. పొత్తు కోరేవారు అధిష్ఠానంతో మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందని, టీడీపీతో పొత్తులో కలిసి రావాలని జనసేన అధినేత పవన్‌ చెబితే సరిపోతుందా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ అయ్యారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×