E-Paper
Advertisement

Vijayashanthi counter to KCR: తగ్గేది లేదు.. రాజీనామాకు కేసీఆర్ సిద్ధమేనా?

Vijayashanthi counter to KCR: తగ్గేది లేదు.. రాజీనామాకు కేసీఆర్ సిద్ధమేనా?
Advertisement

Vijayashanthi counter to KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం ముదిరింది. ఇరుపార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ఛాలెంజ్‌లు విరుసుకున్నారు.. విసురుకుంటున్నారు కూడా. దీనికితోడు లోక్‌సభ ఎన్నికల సీజన్ కావడంతో నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. త్వరలోనే రాజీనామాకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి.

రీసెంట్‌గా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ప్రస్తావించిన పలు అంశాల గురించి విజయశాంతి సోషల్‌మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో హరీష్‌రావు చేసిన సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించారని గుర్తుచేశారు. ఇక ప్రజావాణి అంశంలో కేసీఆర్ సవాల్‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు ఎన్నో సమస్యలకు సమాధానాలు చెబుతుందని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Advertisement

ప్రజావాణిపై కేసీఆర్ చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్యే పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు రాములమ్మ. మొత్తానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ రాములమ్మ బాగానే ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Vijayashanthi challenges kcr ready to his resign on prajavani issue

Vijayashanthi challenges kcr ready to his resign on prajavani issue
Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×