BigTV English

CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!

CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!

CM Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో తన నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు . పల్లె ప్రజలు, రైతులతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఏడాది కూడా సీఎం జగన్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత సీఎం వైఎస్‌ జగన్, సతీమని భారతి దంపతులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు జగన్ సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో దంపతులిద్దరూ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ చంద్రగిరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు ‘X’ ద్వారా తెలిపారు. “ఊరూ వాడా ఒక్కటై, బంధు మిత్రులు ఏకమై అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి, సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని ట్వీట్‌ చేశారు.

.

.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×