BigTV English

CM Jagan : నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే..

CM Jagan : నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే..
cm jagan live today

cm jagan live today (bigtv andhra pradesh) :


జగన్ ఏనాడు ఒంటరి కాదు .. వారికున్న సైన్యం, పొత్తులు అయితే .. నాకున్న సైన్యం, బలం దేవుడు, ప్రజలే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం సభను నిర్వహించారు. ఈ సభకు వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. సభను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.

రాష్ట్రంలో మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు అందరూ సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు జగన్ ప్రశ్నించారు. ఇంటింటి చరిత్రను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. వైసీపీని మరోసారి గెలిపించాలన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకం అయ్యి తన మీద యుద్ధానికి దిగారన్నారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు, అండ్ కో రూపంలో ఉన్నారని పేర్కొన్నారు.


జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తున్న ప్రజలే నా దేవుళ్లు .. నేను అర్జునుడినని జగన్ అన్నారు. చేసిన మంచిని అస్త్రాలుగా మల్చుకుని కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించాలని జగన్ ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధిపైనే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడని జగన్ ప్రశ్నించారు. ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని నిలదీశారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వంలో.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా ఐదువందలకు పైగా సేవలందిస్తున్నామని జగన్ తెలిపారు. డీబీటీ ద్వారా అక్కాచెల్లెమ్మల ఖాతాలో నేరుగా సొమ్మ జమ చేస్తున్నామన్నారు. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చేశామని జగన్ పేర్కొన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×