BigTV English

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!

Jagan Stone Pelting Case Accused gets bail: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కు బెయిల్ మంజూరయ్యింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ విచారణకు సహకరించాలని సతీశ్ ను ఆదేశించింది. శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.


అయితే, ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా విజవాయడలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎంపై దాడి చేశాడు. రాయి తగలడంతో జగన్ ఎడమకంటి కనుబొమ్మకు తీవ్ర గాయమయ్యింది.

Also Read: లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. త్వరలో రాజకీయాల్లోకి ఎన్టీఆర్..?


అదేవిధంగా సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయం అయ్యింది. వెంటనే డాక్టర్లు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తరువాత సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సతీశ్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. ఈ నెల 18న సతీశ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×