Aadhaar download Easy: ఆధార్ కార్డు పేరు చెబితేచాలు చాలామంది భయపడతారు. సర్టిఫికెట్లు, బ్యాంకు అకౌంట్లు, కొత్త గ్యాస్ కావాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. లేకుంటే ఏ పని జరగదు కూడా. సింపుల్ చెప్పాలంటే ప్రభుత్వం అందించే ప్రతీ సర్వీసుకు ఆధార్ కార్డు తప్పనిసరి. టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత రోజుల్లో వాటిని డౌన్‌లోడు చేసుకునే మరింత సులభతరం చేసింది UIDAI. ఇక నుంచి వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇంతకీ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఆధార్ కార్డు చిన్నారుల వృద్ధుల వరకు అందరికీ కీలకమైంది. అది లేకుండా ప్రభుత్వ పనులు ఏదీ సాధ్యం కాదు. ఒకప్పుడు ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే. ఇప్పుడు దేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు కీలకంగా మారింది. సాధారణంగా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఆధార్ డౌన్‌లోడు విషయంలో నెట్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఇకపై అలాంటి అవసరం లేదు. వినియోగదారులు ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారా ఎప్పుడుపడితే అప్పుడు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. మై గవ్ హెల్ప్‌డెస్క్ ద్వారా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. డిజిలాకర్ సేవలతో అనుసంధానించబడి ఉంటుంది. అయితే వాట్సాప్ లోఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ కావాలి. డిజిలాకర్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ లేకపోతే వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండు నిబంధనలు పాటించాలి. అప్పుడే వాట్సాప్ ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలము.
1. మీ ఫోన్‌లో 91-9013151515 నెంబర్‌ను My Gov Helpdesk పేరుతో సేవ్ చేసుకోవాలి
2. ఈ నెంబర్‌కు నమస్తే లేదా హాయ్ అని వాట్సాప్ లో మేసేజ్ పెట్టాలి
3. ఆ తర్వాత డిజిలాకర్ ఎంపికను ఎంచుకోవాలి
4. డిజిలాకర్ ఖాతాను ఓకే చేయాలి. లేకుంటే దాన్ని క్రియేట్ చేసుకోవాలి
5. ఆ ప్రాసెస్ తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయాలి
6. ఆధార్ కార్డుకి లింకైన మొబైల్ నెంబర్‌కు వచ్చిన OTPని WhatsApp చాట్‌లో పంపాలి.
7. OTP ఓకే అయితే తర్వాత DigiLocker లో ఉన్న పత్రాల జాబితాను చూడాలి. అందులో మీ ఆధార్ కార్డును ఎంచుకోవాలి. కోండి.
8. దీని తర్వాత వాట్సాప్‌లో ఆధార్ PDF ఫారమ్‌ని డౌన్‌లోన్ చేసుకుంటే సరిపోతుంది.
UIDAI నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో అందించిన సమాచారంలో మార్పులకు వేర్వేరు పరిమితులు ఉన్నాయి. ఆధార్ కార్డులో రాసిన పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులోని చిరునామాను అనేక సార్లు మార్చుకోచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. ఇక పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ఆధార్ కార్డుకి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎన్నిసార్లు అయినా మార్చవచ్చు. ఈ వివరాలను UIDAI వెబ్‌సైట్‌లో మార్చకోవచ్చు.