BigTV English

CM Jagan : చంద్రబాబు వెనుక గజ దొంగల ముఠా.. దత్తపుత్రుడు, పురందేశ్వరి టీడీపీకి క్యాంపెయినర్లు..

CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా లబ్దిదారులకు నిధులు జమ చేశారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని అభివృద్ధి ఏపీలో కనిపిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

CM Jagan : చంద్రబాబు వెనుక గజ దొంగల ముఠా.. దత్తపుత్రుడు, పురందేశ్వరి టీడీపీకి  క్యాంపెయినర్లు..

CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా లబ్దిదారులకు నిధులు జమ చేశారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని అభివృద్ధి ఏపీలో కనిపిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.


గత ప్రభుత్వం‌లో శాఖలు అన్ని అవినీతిమయం అయ్యాయని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి వచ్చాకా అవినీతిని నిర్మూలించామని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇళ్లు నిర్మాణం పూర్తి అయితే రూ.5 లక్షలు రూపాయల విలువైన ఆస్తి వారి చేతుల్లో ఉంటుందన్నారు. మంచిని నమ్ముకున్న తనకు ఏవరి అవసరం లేదని సీఎం జగన్ తెలిపారు.

ఏనాడు ప్రజలకు మంచి చేయని చంద్రబాబు పక్క పార్టీలోనూ, పక్క రాష్ట్రాల్లొనూ స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారన్నారు.
రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. దత్త పుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క పార్టీకి వెళ్ళి చంద్రబాబు వదిన అయిన దగ్గుపాటి పురందేశ్వరి మరొక స్టార్ క్యాంపెయినర్ అని మండిపడ్డారు. చంద్రబాబు వెంట ఉన్నది గజ దొంగల ముఠా అని విమర్శించారు. గతంలో చంద్రబాబు వ్యవస్థలన్ని నాశనం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా అన్ని వ్యవస్థలు అత్తుత్యమంగా పని చేశాయని సీఎం జగన్ తెలిపారు.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×