BigTV English
Advertisement

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Sujeeth: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి క్రేజ్ ఉన్న వారిలో దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) ఒకరు. ఇప్పటివరకు రాజమౌళి సుమారు 12 సినిమాలకు దర్శకత్వం వహించగా ప్రతి ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక రాజమౌళి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది అంటే రాజమౌళి సినీ విజన్ ఎలా ఉందో స్పష్టం అవుతుంది.


రాజమౌళి తరువాత సుజీత్?

ఇకపోతే ఇలాంటి ఒక గొప్ప దర్శకుడికి పోటీగా మరొక డైరెక్టర్ సుజిత్ (Sujeeth)రావడం విశేషం. అసలు రాజమౌళికి పోటీగా సుజీత్ రావడం ఏంటీ? అనే విషయానికి వస్తే.. సుజిత్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓజీ(OG). ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన డైరెక్టర్ల జాబితాలో సుజీత్ కూడా చేరిపోయారు. ఓజి సినిమాతో పాటు ఇదివరకే ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందు పోచిన సాహో(Sahoo) సినిమా కూడా మొదటి రోజే 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి.

బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు..

ఇకపోతే సౌత్ ఇండస్ట్రీలో ఇలా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి ముందు వరుసలో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2,RRR సినిమాలు వరుసగా 100కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతూ పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్న వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఒకరు. ఈయన దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ 2, సలార్ సినిమాలు వరుసగా 100 కోట్లు రాబట్టాయి. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)ఒకరు.


అదిరిపోయిన ఓజి ఓపెనింగ్స్…

ఇప్పటివరకు లోకేష్ స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసే వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. లోకేష్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లియో, కూలి సినిమాలు కూడా వరుసగా 100 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ దర్శకుల జాబితాలో తాజాగా సుజీత్ చేరటం విశేషం. ఇలా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని క్లైమాక్స్ లో స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్ గురించి చిత్ర బృందం ఎక్కడ అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా సోలో హీరోగా ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పవన్ సక్సెస్ అందుకున్నారు.

Also Read: The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్.. డైరెక్ట్ థియేటరల్లోనే

Related News

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Big Stories

×