Cm Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల హాజరుపై.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, సమావేశాల మొదలయ్యే టైమ్‌కి ఆలస్యంగా రావడం, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే వెళ్లిపోవడం వంటి పరిస్థితులు ఆయనకు అసంతృప్తిని కలిగించాయి.
సమావేశం ప్రారంభానికి సమయానికి శాసనసభలో.. కేవలం 30 మంది మాత్రమే ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.
ఈ సమస్యపై ప్రభుత్వ పక్షానికి చెందిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కఠిన చర్యలకు ముందుకొచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందే విప్‌లను అప్రమత్తం చేసి, హాజరు సక్రమంగా ఉండేలా నిర్ధారించారు. ముఖ్యమంత్రి ఆరా తీసిన వెంటనే, సమావేశానికి డుమ్మా కొట్టిన 17 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, అప్పటికప్పుడు హాజరు కావాలని పిలిపించారు.
చంద్రబాబు ఆదేశాల తర్వాత అసెంబ్లీలో సభ్యుల హాజరు సమస్య కొంతమేర తగ్గినట్టు సమాచారం. అన్ని విప్‌లు తమలోని ఎమ్మెల్యేలను కట్టుబడేలా చేసి, సమావేశాల్లో హాజరు కల్పించడం ప్రారంభించారు.
ప్రజా సమస్యలు.. రాష్ట్రాభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక అని సీఎం చంద్రబాబు నమ్ముతారు. అందుకే ఆయన ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరువుతారు. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటూ.. వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన కీలక సూచన చేశారు.
Also Read: డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్.. డాక్టర్‌పై అఘాయిత్యం చేయబోయిన యువకుడు
అలాంటిది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన సీరియస్ అయ్యారు. ఈ వర్షా కాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి 10 రోజుల పాటు కొనసాగనున్నాయి.