Hydra Commissioner: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో గురువారం సచివాయలంలోని ఫారెస్టు మినిస్టర్ ఛాంబర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు.
బతుకమ్మ కుంట పునరుద్ధరణపై ప్రశంసలు
బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరణకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు.
దేవాదాయ శాఖ భూముల సమస్య
భేటీ సందర్భంగా మంత్రి సురేఖ ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధీనంలోని భూములు అనేక ప్రాంతాల్లో.. ఆక్రమణలకు గురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, డీజీపీఎస్ సర్వే ద్వారా ఇప్పటికే ఈ భూములపై.. సమగ్ర పరిశీలన జరుగుతోందని తెలిపారు. ఆక్రమణల వివరాలు స్పష్టంగా గుర్తించిన తరువాత, ప్రభుత్వం అనుమతులతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూముల పరిరక్షణకు అవసరమైన సాంకేతిక, పరిపాలన సహకారం అందిస్తామని తెలిపారు.
హైడ్రా చేపడుతున్న పనులు
రాష్ట్రంలో భూసంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పథకాలను అమలు చేస్తూ, హైడ్రా ఇప్పటివరకు చేసిన పనుల వివరాలను రంగనాథ్ మంత్రి సురేఖకు సమగ్రంగా వివరించారు. పలు ప్రాజెక్టులు ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
వరంగల్ నాలాల ఆక్రమణలపై చర్చ
భేటీ సమయంలో మంత్రి వరంగల్ ప్రాంతంలోని.. నాలాల ఆక్రమణల సమస్యను కూడా ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడంలో హైడ్రా సహకారం అందించాలని కోరారు. దీనికి కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారు.
Also Read: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు
బతుకమ్మ కుంట వేడుకలకు ఆహ్వానం
చివరగా, రానున్న బతుకమ్మ కుంట వేడుకలకు మంత్రి సురేఖను కమిషనర్ రంగనాథ్ ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ ఉత్సవాల్లో, పునరుద్ధరించిన బతుకమ్మ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.