Payyavula Vs Botsa: మండలిలో గురువారం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అంశం కుదిపేసింది. దీనిపై అధికార-విపక్షాల మాటల యుద్ధం నడిచింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రతిపక్ష నేత బొత్స మధ్య వాదోపవాదనలు జరిగాయి. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు.
పీఆర్సీ, బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ఏపీ మండలిలో గురువారం ప్రశ్నోత్తరాలు సాగాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు నోరువిప్పారు. ఉద్యోగులకు పాలిచ్చే జగన్‌ని వద్దనుకుని, తన్నే చంద్రబాబును తెచ్చుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ ఇజ్రాయల్. 15 నెలలు గడిచినా ఐఆర్ ఇవ్వలేదని, నాలుుడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. పీఆర్సీ వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకని మరో ఎమ్మెల్సీ కల్పలత ప్రశ్నించారు.
ఇదే క్రమంలో ప్రతిపక్షనేత బొత్స మరికొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. పీఆర్సీ ఇస్తారో, ఫిట్మెంట్ ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రిప్లై ఇచ్చారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి ఉందన్నారు. ఐఆర్, పీఆర్సీ కమిటీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
ఇదే క్రమంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు ఆర్థికమంత్రి. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును అప్పటి జగన్ సర్కార్ ఇతర అవసరాలకు వాడుకుందని విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతల మాటలు ఉద్యోగుల విషయంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే సింగిల్ డిజిట్ పరిమితమయ్యిందన్నారు.
ALSO READ: దేశంలో తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో
జగన్ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాల సొమ్మును ఇతర అవసరాలకు వాడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఆర్థికమంత్రి. గతంలో తెలంగాణ కంటే ఒక శాతం దాదాపు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
కరోనా పేరు చెప్పి ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను వైసీపీ సర్కారు తగ్గించిందన్నారు. కరోనా విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దానికంటే ఎక్కువ నిధులు తీసుకుందని వివరించారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రభుత్వం చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
పీఆర్సీపై శాసనమండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి
జీపీఎఫ్ నిధులను డైవర్ట్ చేసిన గత వైసీపీ ప్రభుత్వం.. ఈ రోజు ఉద్యోగులపై ప్రేమ చూపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శలు pic.twitter.com/1wQn8yvoFw
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2025
ఏపీ శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ pic.twitter.com/NkiLxGwheP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2025