BigTV English

Baz Ball : “బజ్ బాల్” వ్యూహం అంత గొప్పదా?

Baz Ball : “బజ్ బాల్” వ్యూహం అంత గొప్పదా?
Baz Ball

Baz Ball : క్రికెట్లో ఎప్పటికప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ అవుతూ ఉంటుంది. ఆటగాళ్లు కొట్టే కొత్త రకం షాట్లపై ఇంతకు ముందు చర్చించుకునేవారు. ముఖ్యంగా ధోనీ కొట్టే హెలికాఫ్టర్ షాట్, అలాగే సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీలు తిరిగి కొట్టే స్కై షాట్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. 


కానీ ఇప్పుడు బజ్ బాల్ వ్యూహం గురించి చర్చించుకుంటున్నారు. అసలీ బజ్ బాల్ అంటే ఏమిటి.. క్రికెట్ కి ఈ బజ్ బాల్ పదానికి సంబంధం ఏమిటి ? అన్నది సోషల్ మీడియాలో గట్టిగానే సెర్చ్ జరుగుతోంది. ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఎటాకింగ్ మోడ్లోకి వెళ్లి ఆడటమే బజ్ బాల్ వ్యూహం. ఇటీవల న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు ఇదే వ్యూహాన్ని ఆచరణలో పెట్టి విజయం సాధించింది.

ఆ మ్యాచ్ లో 378 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగింది. వికెట్ కాపాడుకుంటూ ఆడటం కంటే, ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఫోర్లతో చెలరేగిపోయారు. ఒకటి రెండు పరుగులు తీస్తూనే టీ 20 తరహాలో రెచ్చిపోయారు. అలవోకగా విజయం సాధించారు. ఆశ్చర్యపోవడం, చేష్టలుడిగి చూడటం న్యూజిలాండ్ వంతయ్యింది.


అయితే బజ్ బాల్ వ్యూహం అనుకున్నంత గొప్పదేం కాదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అవుట్ అవుతారు. లేదా కనెక్ట్ అవుతారు. అలా అయినప్పుడే మ్యాచ్ గెలుస్తారని చెబుతున్నారు.  ఎళ్లవేళలా ఈ మ్యాజిక్ రిపీట్ కాదని అంటున్నారు.

పిచ్ స్వభావాన్ని అంచనా వేసి వికెట్లను పారేసుకుంటూ, అతి డిఫెన్స్ ఆడి స్లిప్పుల్లో క్యాచ్ లు ఇస్తూ, రోజంతా ఆడి అదే గొప్పనుకుంటూ ఆడే రోజులు పోయాయని కొందరు నమ్ముతున్నారు. అందుకనే ఇంగ్లాండ్ జట్టు ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. అయితే అనుకున్నంత ఈజీగా అయితే లేదు. గట్టిగానే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

2023 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఇదే వ్యూహంతో ఆడి  7వ స్థానానికి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వారెక్కడా తగ్గడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఇంగ్లాండ్ జట్టు పరిస్థితేమిటి? ఇలా అయిపోయందనుకున్నా, వారు వినడం లేదు. తగ్గేదేలేదంటున్నారు. టీమ్ మేనేజ్మెంట్ తో కలిసి, నిర్ణయాలు తీసుకుని రెచ్చిపోయి ఆడుతున్నారు.

ఇంగ్లాండు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం సీరియస్ గానే బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. కోచ్ మెక్ కల్లమ్ తో కలిసి ఇంగ్లాండ్ టెస్ట్ లు ఆడే విధానాన్నే మార్చేశాడు. బజ్ బాల్ ఆట తీరుతో ఇప్పటివరకు కెప్టెన్ స్టోక్స్ 18 టెస్టుల్లో 13 విజయాలు అందుకున్నాడు. అందువల్ల రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ కూడా సిరీస్ గెలిచి, భారత్ విజయాల పరంపరకు బ్రేక్ వేయాలని చూస్తున్నాడు.

ఈ బజ్ బాల్ ట్రెండ్ తెరమీదకు రావడంతో టెస్ట్ క్రికెట్ కు సరికొత్త శోభను సంతరించుకుంటోందనేది తెలుస్తోంది. కానీ ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని మరికొంతమంది భావిస్తున్నారు.

Related News

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

Big Stories

×