E-Paper
Advertisement

Cold Wave Alert: అయ్య బాబోయ్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. డేంజర్‌లో ఈ జిల్లాలు..

Cold Wave Alert: అయ్య బాబోయ్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. డేంజర్‌లో ఈ జిల్లాలు..
Advertisement

Cold Wave Alert: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చలి స్టార్టింగ్‌లోనే ఇంత చలి ఉంటే తర్వాత ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికించేస్తోంది.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తొమ్మిది నుంచి పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తుండగా.. రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నవంబర్ నెలలో 13 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వచ్చే రెండ్రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు.

Advertisement

తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్ నగర్, పటాన్ చెరు, హైదరాబాద్, దుండిగల్, మహబూబ్ నగర్, రాజేంద్రనగర్, ఖమ్మం, హకీమ్ పేట్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే మిగత జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉంటుందని తెలిపారు. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని బయటకు ఎక్కువగా వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

Also Read: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్

Advertisement

ఏపీలో కూడా పలు జిల్లాల్లో చలి జనాలకు వణికిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో అల్లూరిసీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానం, అనంతపురం, నంద్యాల, కడప, కర్నూల్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అన్నమయ్య జిల్లాలో చలిపులి పంజా విసిరింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం వల్ల చలి తీవ్రత భారీ స్థాయిలో పెరిగిపోతుంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×