Hyderabad News: బయో-టెర్రర్ కుట్రపై గుజరాత్ ఏటీఎస్ ఫోకస్ చేసిందా? ఇప్పటివరకు పట్టుబడిన డాక్టర్ల నుంచి కీలక సమాచారం సేకరించిందా? ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేసిందా? హైదరాబాద్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో గత రాత్రి సోదాలు చేపట్టిందా? రిసిన్ పాయిజన్‌కు సంబంధించి మెటీరియల్ స్వాధీనం చేసుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు
అహ్మదాబాద్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్- ATS స్పెషల్ టీమ్ మంగళవారం రాత్రి రాజేంద్రనగర్‌లోని డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యిద్‌కు చెందిన ఫ్రంట్ వ్యూ అపార్ట్‌మెంట్‌పై దాడులు చేపట్టింది. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకరమైన విషాల్లో ఒకటి. రిసిన్ రా మెటీరియన్‌ను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది.
ఈ సోదాల్లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, ఐదుగురు సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. బయో-టెర్రర్ కుట్రలో ప్రధాన నిందితుడు 35 ఏళ్ల సయ్యద్ ఇంటిలో ఓ వర్క్‌షాప్ ఉంది. సోదాలు చేసిన అధికారులకు భారీగా సామగ్రిని కనుగొంది. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు.
భారీగా రిసిన్ సీజ్ చేసిన అధికారులు
మూడు రకాల లిక్విడ్‌తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి అప్పుడు సెర్చ్ చేశారు. ఆ తర్వాత రిసిన్ మెటీరియన్‌ను సీజ్ చేశారు.
గత వారం డాక్టర్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీం ఖాన్ లను అరెస్టు చేసింది గుజరాత్ ఏటీఎస్. మొహియుద్దీన్ తప్పితే మిగతా ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్, షామ్లి జిల్లాలకు చెందినవారు. అక్కడ పోలీసులు విచారించగా బయో టెర్రర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జనరల్ ఫిజీషియన్ అయిన అతడు, రోగులకు ఉచితంగా చూస్తాడని తేలింది. అంతేకాదు ఆన్‌లైన్ ఫుడ్ అవుట్‌లెట్‌లో వ్యాపార భాగస్వామి అని పోలీసు వర్గాలు తెలిపాయి.
ALSO READ: అయ్య బాబోయ్.. తెలుగు రాష్ట్రాలను చంపేస్తున్న చలిపులి
గుజరాత్ వెళ్లే ముందు డాక్టర్ మొహియుద్దీన్ వ్యాపార పనుల కోసం బయటకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులను చెప్పినట్టు ఆయన సోదరుడు తెలిపాడు. కొద్దిరోజుల కిందట కొంత సామాగ్రిని తెచ్చి ఓ మెషీన్ ద్వారా కొంత ద్రవాన్ని తయారు చేస్తున్నాడనని వివరించాడు. రిసిన్ అనే విష పదార్థం అని పోలీసులు మాకు చెప్పారని మొహియుద్దీన్ సోదరుడు సయ్యద్ ఫరూఖ్ మీడియాకు తెలిపాడు.
ఫ్యామిలో సయ్యిద్ ఆరుగురు పిల్లలలో పెద్దవాడు. అతడు ఖమ్మం ప్రాంతానికి చెందినవాడు. ఇంటర్మీడియట్ వరకు హనుమకొండలో చదివాడు. 2007లో MBBS కోసం చైనా వెళ్ళాడు. 2012-13 ఏడాదిలో తెలంగాణకు వచ్చిన తర్వాత కొంతకాలం ఖమ్మంలో గడిపాడు. తొలుత మెహదీపట్నంలో ఆ ఫ్యామిలీ ఉండేది. ఆ తర్వాత టోలిచౌకికి వెళ్లింది. గడిచిన నాలుగేళ్లు రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంతంలో పలు అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
అర్ధరాత్రి రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS పోలీస్ సోదాలు
ఫోర్త్ వ్యూ కాలనీలోని డా.సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు
సోదాల్లో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, ఐదుగురు సభ్యుల బృందం
మూడు రకాల లిక్విడ్‌తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారుచేసే మిషన్ సహా పలు… pic.twitter.com/qdqRxJqFwq
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2025