Big Stories

CPI Narayana: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే..? : నారాయణ జోస్యం

CPI Narayana Comments: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు తాను లేఖ రాసినట్లు నారాయణ చెప్పారు. ప్రధాని మోదీ విధానాలపై కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

- Advertisement -

ఏపీలో లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంటూ పదే పదే మాట్లాడుతున్న మోదీ, వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? ఉంటే చూపించు మోదీ అంటూ ప్రశ్నించారు. ఆధారాలు చూపించకపోతే తెలుగు ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా మంగళసూత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పేదలపై భారం వేసి కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు. డబ్బులను ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్లిపోయిన వారిలో ఏ ఒక్కరైనా క్రిస్టియన్, ముస్లిం లేరన్నారు. అదేవిధంగా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

- Advertisement -

ఏపీలో అధికారంలోకి వచ్చేది చంద్రబాబు లేదా జగన్ కాదని.. ఈ రెండు పార్టీలను చీల్చి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నారాయణ జోస్యం చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే వారికి జగన్, చంద్రబాబు పాలకులుగా ఉంటారన్నారు. విజయవాడలో మోదీ పర్యటన కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

Also Read: మాదిగలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తా: ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే.. నేడు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ వేములవాడ, వరంగల్ బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీకి రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు.. అది ఒకరు హన్మకొండ ఎంపీ అంటూ ప్రధాని గుర్తు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రసంగం అనంతరం అక్కడి నుంచి ఏపీకి బయలుదేరి వెళ్లారు. ఏపీలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనునన్నారు. అక్కడి నుంచి విజయవాడలో నిర్వహించి రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News