Big Stories

Ysrcp color for polling booth: ఇదేం పిచ్చి బాబోయ్, ఆపై మోడల్ పోలింగ్ బూత్ అంటూ..

Ysrcp color for polling booth: వైఎస్ఆర్‌సీపీ గుర్తు అంటే మూడు రంగులు గుర్తు కొస్తాయి. ఒక్కో రంగు ఒక్కో అర్థం వచ్చేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు తెగ సౌండ్ చేస్తుంటారు. ఆ పార్టీ కలర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలనే ఏమో తెలీదుగానీ, ఏకంగా పోలింగ్ బూత్‌కు సేమ్ కలర్ వేశారు. దీన్ని పసిగట్టిన స్థానిక నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, ఆయన మొట్టికాయలు వేయడం చకచకా జరిగింది. చివరకు రంగులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎక్కడ జరిగిందో తెలుసా?

- Advertisement -

డీటేల్స్‌లోకి వెళ్తే.. ఏలూరులో 23వ డివిజన్ కట్ట సుబ్బారావు తోటలో 57వ పోలింగ్ బూత్‌కు అధికార పార్టీకి చెందిన జెండా రంగు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మోడల్ పోలింగ్ బూత్ పేరుతో అధికార పార్టీకి చెందిన జెండాలోని గ్రీన్, బ్లూ కలర్ వేస్తున్న సమయంలో స్థానికులు పసిగట్టారు.. చివరకు అభ్యంతరం తెలిపారు. కానీ కూలీలు ససేమిరా అన్నారు. చివరకు చేసిందేమీ లేక స్థానిక పార్టీల నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. చివరకు ఆ రంగు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

రంగుల పిచ్చి ఇప్పుడు వచ్చిందేమీ కాదని స్థానికులు అంటున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రభుత్వ భవనాలకు కలర్స్ మార్చేసింది. గ్రామ సచివాలయాలు, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు రంగులు మార్చేసింది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకావడంతో రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం రంగులు మార్చాల్సిన వచ్చింది.

ALSO READ: భారతిపై షర్మిల ఆగ్రహం, గొడ్డలితో నరికేయండి.. పారిపోవడానికి పాస్‌పోర్టు..

రంగులు మార్చేందుకు మళ్లీ 1300 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వార్తలు షికార్లు చేశాయి. గ్రామ సచివాలయానికి రంగులు మార్చేందుకు సగటున 50 వేల చొప్పున లెక్కిస్తే.. 75 కోట్ల రూపాయలు అవుతుందన్నది ఓ లెక్క. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి మార్చారు. దానివల్ల వందల కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. తాజాగా ఇప్పుడు పోలింగ్ బూత్ వంతైంది. వైసీపీయా మజాకా?

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News