E-Paper
Advertisement

BrahmaAnandam: తండ్రీకొడుకులు.. తాతామనవళ్లు అయ్యారే

BrahmaAnandam: తండ్రీకొడుకులు.. తాతామనవళ్లు అయ్యారే
Advertisement

BrahmaAnandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ కమెడియన్ అయినా కూడా కొడుకును సక్సెస్ ఫుల్ హీరోగా చేయలేకపోయాడు. బ్రహ్మీ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకున్నా .. ఆ తరువాత గౌతమ్ కు ఆశించిన అవకాశాలు రాలేదు.

ఇక చాలా కాలం తరువాత మను అనే సినిమాతో గౌతమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది దూత వెబ్ సిరీస్ లో గౌతమ్ విలన్ గా నటించి మెప్పించాడు. ఒక మంచి కథతో మళ్లీ హీరోగా హిట్ కొట్టాలని గౌతమ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం బ్రహ్మ ఆనందం.

Advertisement

RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ మరో పాత్ర లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మీ- గౌతమ్ తండ్రీ కొడుకులుగా కాకుండా తాతా మనవళ్లుగా నటించనున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుపుతూనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 6 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో ఈ తండ్రీకొడుకులు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×