Big Stories

PM Modi: మాదిగలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తా: ప్రధాని మోదీ

PM Modi Comments in Warangal: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. ఉదయం వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న మోదీ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయాన్ని కోరుతూ వేములవాడలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

అనంతరం అక్కడి నుంచి వరంగల్ కు చేరుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారం అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని, అహ్మాదాబాద్ తన కర్మ భూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళి అంటూ ప్రధాని అన్నారు. మూడో విడత పోలింగ్ తో రెండు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. బీజేపీ విజయం వైపు దూసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

బీజేపీకి రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు అందులో ఒకరు హన్మకొండ నుంచే ఉన్నారంటూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. తెలంగాణలో పసుపుబోర్డును ఏర్పాటు చేసి పసుపు రైతులకు అండగా నిలిచామన్నారు. తమ హక్కు కోసం పోరాడుతున్న మాదిగలకు ఇచ్చిన హామీని తాను ఖచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. 2014లో దళితుడిని సీఎంను చేస్తానన్న హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. అంతేకాదు.. దళిత బంధు పేరుతో మోసం చేసిందన్నారు.

Also Read: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. బీఆర్ఎస్ అడ్రస్ కనిపించడం కూడా కష్టమే : ప్రధాని మోదీ

కాగా, సభలో ప్రసంగించిన అనంతరం ఆయన వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ కూడా నిర్వహించే బీజేపీ బహిరంగ సభలలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా విజయవాడలో నిర్వహించే రోడ్ షోలో కూడా ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News